HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Alerts Officials In Wake Of Heavy Rains

Heavy Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Heavy Rains : మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు.

  • Author : Sudheer Date : 21-05-2025 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy Rains
Heavy Rains

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాతావరణ శాఖ ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తత అవసరమని సీఎం సూచించారు. హైదరాబాద్‌ సహా అనేక జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Good News : ఇందిరమ్మ లబ్దిదారులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో, రేవంత్ రెడ్డి వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేసేందుకు సూచించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తగిన మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

రైతులు కూడా ఈ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడవకుండా తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలో వివిధ విభాగాలు , పోలీసులు, హైడ్రా, విద్యుత్ శాఖలు , పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన సీఎం, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • heavy rains
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • ASUS : ఆసుస్ నుండి సరికొత్త ల్యాప్‌టాప్‌

    • Parkinson : పార్కిన్సన్స్ లక్షణాలను నియంత్రించే అత్యాధునిక పరికరం

    • Swiggy : ‘స్విగ్గీ రెస్టారెంట్ అవార్డ్స్ 2026’ అదరగొట్టిన హైదరాబాద్

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    Trending News

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd