CM Revanth : యువత విద్యను నిర్లక్ష్యం చేయద్దు..పోటీ పరీక్షలకు సిద్ధం కండి – సీఎం రేవంత్
CM Revanth : ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు
- Author : Sudheer
Date : 04-11-2024 - 10:08 IST
Published By : Hashtagu Telugu Desk
యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని, పోటీ పరీక్షలకు సిద్దం అవ్వండని, రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు అని, విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమని అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ (Prem Sagar) ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులతో రేవంత్ మాట్లాడారు.
డైట్ మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, సొంత హాస్టల్ భవనం నిర్మాణాన్ని కోరారు. దీనికి సీఎం స్థల సేకరణ అనంతరం హాస్టల్ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్, యువతకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు ఉన్నాయని, ఐటీఐలను ఏటీసీలుగా మార్చి, విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంపొందించాలని సూచించారు.
యువతకు వృత్తిపరమైన ప్రతిభా అభివృద్ధి అవసరమని, పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఉద్దేశించారు. సకాలంలో విద్యా సామాగ్రి పంపిణీ, మహిళా సంఘాల సహకారంతో యూనిఫామ్స్ కుట్టించే విధానం చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా చూడాలని పిలుపునిస్తూ, వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు వారానికోసారి వసతి గృహాలను సందర్శించాలని ఆదేశించారు.
Read Also : Nikhil Appudo Ippudo Eppudo Trailer Talk : నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ టాక్..!