CM KCR: నేడు కొండగట్టుకు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (CM KCR) నేడు కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలలోపు అక్కడికి చేరుకుని మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు.
- By Gopichand Published Date - 08:20 AM, Wed - 15 February 23

సీఎం కేసీఆర్ (CM KCR) నేడు కొండగట్టులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలలోపు అక్కడికి చేరుకుని మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఉదయం 9.30 గంటల తర్వాత ఆయన ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది. ఆలయం, చుట్టుపక్కల అభివృద్ధి కోసం వివిధ ప్రదేశాలను సీఎం కెసిఆర్ పరిశీలించి, ఆలయంలో చేపట్టాల్సిన పనులపై చర్చించడానికి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, తదితరులు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
Also Read: Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.100 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది చివర్లో జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఇది జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కూడా ఆదివారం ఆలయాన్ని సందర్శించారు.