Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
బీబీనగర్ సమీపంలో ఘోర ప్రమాదం తప్పింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express) రైలు పట్టాలు తప్పింది.
- Author : Gopichand
Date : 15-02-2023 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
బీబీనగర్ సమీపంలో ఘోర ప్రమాదం తప్పింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ (Godavari Express) రైలు పట్టాలు తప్పింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. S4 నుంచి మొదలై మిగితా బోగీలన్నీ పట్టాలు తప్పాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చర్యలు ప్రారంభించారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ కిందపడిపోకపోవడంతో ముప్పు తప్పిందని సమాచారం. ఇంజిన్ తర్వాత 10 బోగీలు సేఫ్‌గా ఉన్నాయి. కొత్త కోచ్‌లు కావడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Suicide : గ్రేటర్ నోయిడాలో విషాదం.. 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య.. కారణం ఇదే..?