CM KCR : 51 మందికి బీ-ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్..
ప్రస్తుతం సిద్దమైన 51 మంది బీ-ఫారాలు సీఎం కేసీఆర్ స్వయంగా వారికీ అందజేశారు. బీ-ఫారాలు అందజేసి పలు సూచనలు తెలియజేసారు
- Author : Sudheer
Date : 15-10-2023 - 1:27 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ భవన్ లో గులాబీ బాస్ సీఎం కేసీఆర్ (CM KCR)..51 మందికి బీ-ఫారాలు (B-forms) అందజేశారు. మిగతావారి బీ-ఫారాలు సిద్ధం కాకపోవడం తో ప్రస్తుతం సిద్దమైన 51 మంది బీ-ఫారాలు సీఎం కేసీఆర్ స్వయంగా వారికీ అందజేశారు. బీ-ఫారాలు అందజేసి పలు సూచనలు తెలియజేసారు. బీ-ఫారాలు (B-Forms )నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. పొరపాటు చేయొద్దని కేసీఆర్ సూచించారు. అలాగే ఐదుగురు నేతలను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నాడనే వార్త బీ-ఫారాలు తీసుకొని నేతల్లో మొదలైంది. ఆ ఐదుగురు ఎవరు అనేది తెలియడం లేదు.
ఇక ఈ సందర్బంగా కేసీఆర్ (KCR Speech) మాట్లాడుతూ.. రాజకీయాలు అన్నతర్వాత మంచి, చెడు ఉంటాయి. అలకలు ఉంటాయి. అందరి కంటే ఎక్కువగా అబ్యర్థులు ప్రజల్లో ఉండాలి. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇది తప్పక పాటించాలి. గత ఎన్నికల్లో ఒకరిద్దరికి చెప్పాను. వ్యక్తిత్వం మార్చుకోవాలని చెప్పాను. మాట్లాడలేదు. ఒకరు ఓడిపోయారు. జూపల్లి కృష్ణారావు ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఓడిపోయారు. అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు..? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. నాయకుల చిలిపి పనులు, చిల్లర పనుల వల్ల ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి. మంచిగా మాట్లాడం, ప్రవర్తించడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నా.. ఇది ఇంపార్టెంట్ ఘట్టం. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. కార్యకర్తలకు మనల్ని అడిగే అధికారం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.
Read Also : Google AI Images : గూగుల్ లో ‘టెక్స్ట్ టు ఇమేజ్’ ఏఐ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది ?