HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Take Swipe At Bjp Leaders In Vikarabad Rally

CM KCR :మోదీని చూస్తే ఇక్కడున్న బీజేపీ నేతలకు వణుకుతుంది..!!

కాషాయం జెండాను చూసి మోసపోవద్దని...మోసపోయి బాధపడాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ సభలో వ్యాఖ్యానించారు.

  • Author : hashtagu Date : 16-08-2022 - 8:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM kcr and telangana
CM KCR Telangana

కాషాయం జెండాను చూసి మోసపోవద్దని…మోసపోయి బాధపడాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ సభలో వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్…అక్కడ ప్రసంగించారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంతో తేల్చమంటే కేంద్రం పట్టించుకోవడం లేదని…తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని నిలదీయాంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిలిచిపోయిందని కృష్ణా జలాల్లో వాటా ఎంతో తేల్చాలని కేంద్రాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మోదీని చూస్తే వణికిపోతారని ఎద్దేవా చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతిఇంటికీ నీళ్లు తీసుకువచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు కేసీఆర్.

ఈ 8ఏళ్లకాలంలో బీజేపీ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయని మోదీ ప్రభుత్వం…ఉచిత పథకాలు రద్దు చేయాలని చెబుతోందని మండిపడ్డారు. బీజేపీ జెండాను చూసి మోసపోకండి…ఉచిత కరెంటు రాదు, మోటార్లకు మీటర్లు పెడతారంటూ పేర్కొన్నారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇవ్వని మోదీ ప్రభుత్వ పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ. 20లక్షల కోట్లు దోచిపెడుతోందని మండిపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • cm kcr
  • sabha
  • trs
  • Vikarabad

Related News

west bengal

BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో భారీ మంత్రివర్గ విస్తరణ చేపట్టగా, సోమవారం 35 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్. రవి నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంతో రాష్ట్ర మంత్రివర్గ బలం 41కు చేరుకుంది. అవినీతి నిరోధం, మహిళ

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

Latest News

  • Telangana: మహిళలకు మరో అదిరిపోయే శుభవార్త.. మహిళా శక్తి సూపర్ బజార్లు

  • Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..

  • CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd