TS : ఇవాళ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం…ఏం చెబుతారో..?
- Author : hashtagu
Date : 28-10-2022 - 1:28 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏదైనా వ్యూహంలోనే భాగంగానే…ఇలా సైలెంట్ గా ఉన్నారా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ…అధికారపార్టీపై దండెత్తడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు. దీనికి కారణం ఏంటి. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయం బయటకు రాగానే..ప్రగతి భవన్ లో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడతారన్న వార్తలు వచ్చాయి. తర్వాత సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. అటు ఎమ్మెల్యేలు, ఇటు కేసీఆర్ నోరు మెదపలేదు.
అయితే ఇవాళ సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం పెడతారని తెలుస్తోంది. ఈ విషయాన్ని టీఆరెస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. అయితే కేసీఆర్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు. ఏం సంచలనాలను బయటపెడతారు. దీనిపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ కూడా టీఆర్ఎస్ కదలికలను నిశితంగా గమనిస్తోంది.