Whats Today : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేసీఆర్, రేవంత్.. నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ ఢీ
Whats Today : విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
- Author : Pasha
Date : 08-11-2023 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
Whats Today : విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావంగా విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం వెయ్యి రోజులకు చేరుకున్న నేపథ్యంలో ‘విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ’, ‘కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు’ నినాదంతో ఈ బంద్ చేపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 48 గంటలలో ఏపీలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగే వైఎస్సార్ సీపీ సామాజిక, సాధికారిక యాత్రలో ఎంపీ విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, పలువురు మంత్రులు పాల్గొంటారు.
- ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొంటారు.
- ఇవాళ సంగారెడ్డిలోని గంజి మైదాన్ లో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. బహిరంగసభ ఏర్పాట్లను టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎన్జీవోస్ మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ దగ్గరుండి పరిశీలించారు.
- ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభలలో పాల్గొంటారు.
- ఇవాళ మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- ఇవాళ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కొత్తగూడెం కాంగ్రెస్- సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారు.
- ఇవాళ కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల పర్యటిస్తారు. బీజేపీ అభ్యర్థి వెంకట రమణా రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.
- ఇవాళ వరల్డ్ కప్ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌తో ఇంగ్లాండ్ తలపడబోతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు ఒకే ఒక విజయం సాధించింది. పూణే వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక నెదర్లాండ్స్ జట్టు కూడా రెండు విజయాలను సాధించినప్పటికీ సెమీస్‌లోకి వెళ్లే అవకాశాలు(Whats Today) లేవు.