Telangana: అందుకే కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పోయిండు
ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 78 సీట్లకు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. 2014కు ముందే కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని..
- By Praveen Aluthuru Published Date - 10:27 PM, Tue - 21 November 23

Telangana: ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 78 సీట్లకు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. 2014కు ముందే కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని.. రాష్ట్ర విభజన సమయంలో సోనియాగాంధీ తెలంగాణకు నాలుగు శాతం అదనపు విద్యుత్‌ను కేటాయించారని భట్టి గుర్తు చేశారు.ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బకొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. గెలవలేమన్న భయంతోనే కేసీఆర్ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయారని ఆరోపించారు. కేసీఆర్ లాగా ఫాంహౌస్ లో పడుకోలేదని, రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతూనే మధిర నియోజకవర్గ సమస్యలపై మాట్లాడానని అన్నారు.రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలను చూశానన్నారు. మధిర ప్రజలను ఎవరూ కొనలేరు. పింఛన్లు ఇచ్చి, ఇళ్లు కట్టించి, ప్రాజెక్టులు కట్టించి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని అమిత్ షా అన్నారు. కేసీఆర్ అవినీతి చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాడిదలా మారుతుందా అని భట్టి ప్రశ్నించారు.
Also Read: KTR : కాంగ్రెస్ దరిద్ర పాలన కావాలా..? 24 కరెంటు కావాలా..? మీరే తేల్చుకోండి – కేటీఆర్