Telangana BJP: బీజేపీలో చీకోటి ప్రవీణ్‌కు లైన్ క్లియర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
- By Praveen Aluthuru Published Date - 02:38 PM, Sat - 7 October 23

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక తెలంగాణ బీజేపీలో మొన్నటిదాకా ప్రజల్లో కాస్త ఆదరణ ఉండేది.ఒక్కసారిగా కాంగ్రెస్ దూసుకురావడంతో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ అభ్యర్థులు కరువయ్యారు. తాజాగా బర్కత్‌పుర బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరారు. చికోటి ప్రవీణ్ ను కాషాయ జెండా కప్పి ఆమె పార్టీలోకి ఆహ్వానించింది. .
ఇటీవల బీజేపీ కార్యాలయంలో చీకోటి ప్రవీణ్‌కు అవమానం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది . పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చిన ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ నేతలు నిరాకరించారు . పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకోవడానికి ఎవరూ లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. గతంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తర్వాత పార్టీలో చేర్చుకున్నారు.బీజేపీ అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చీకోటి ప్రవీణ్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు . చికోటి ప్రవీణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది . మోదీ స్ఫూర్తితోనే బీజేపీలో చేరుతున్నట్లు తాజాగా వ్యాఖ్యానించారు.
Also Read: MBBS Pass Marks : ఎంబీబీఎస్ పాస్ మార్కులపై ఎన్ఎంసీ వెనకడుగు.. పాత విధానానికే జై