Chappal Thrown On Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై చెప్పుల దాడి..అంటూ పాత వీడియో వైరల్
ఐదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేపట్టిన చలోరే చలోరే చల్ యాత్ర లో జరిగింది..
- Author : Sudheer
Date : 24-11-2023 - 8:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో(Telangana Election Campaign) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై చెప్పుల దాడి జరిగిందంటూ కొంతమంది ఓల్డ్ వీడియో ను సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. కొత్తగూడెం పర్యటనలో భాగంగా రోడ్ షో లో పాల్గొనగా..ఆయన కాన్వాయ్ ఫై ఓ వ్యక్తి చెప్పు విసిరాడని, లక్కీగా ఆ చెప్పు పవన్ కళ్యాణ్ ముందు పడిందని, ఇక ఈ చెప్పులు విసిరిన వ్యక్తులను పట్టుకున్న జనసేన శ్రేణులు , అభిమానులు వారిని చితికబాదారని చెప్పి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుండడం తో దీనిని చూసి చాలామంది నిజమేనా అని షాక్ అవుతున్నారు. వాస్తవానికి ఇది జరిగింది ఇప్పుడు కాదు..ఐదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ చేపట్టిన చలోరే చలోరే చల్ యాత్ర (Chalore Chalore Chal yatra)లో జరిగింది. ఖమ్మంలో ఆయన కాన్వాయ్ తో యాత్ర చేస్తుండగా..కొంతమంది దుండగులు చెప్పులు (Chappal Thrown On Pawan Kalyan) విసిరారు. దానికి సంబదించిన వీడియో ను ఇప్పుడు వైరల్ చేస్తూ…తాజాగా ఎన్నికల ప్రచారంలో చెప్పుల దాడి జరిగిందని ప్రచారం చేస్తూ..పవన్ ఇమేజ్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణ ఎన్నికల ప్రచారం(Election Campaign )లో భాగంగా గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొత్తగూడెం (Kothagudem) సభలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బిజెపి (BJP) తో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన (Janasena) పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. ఈ తరుణంలో బుధువారం నుండి పవన్ (Pawan Kalyan) ప్రచారంలోకి అడుగుపెట్టారు.
కొత్తగూడెం సభలో ఆయన మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో ప్రతీరోజూ ఎన్నికల లాగానే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస పరీక్ష పేపర్ లీక్స్ తో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోయారని.. తల్లిదండ్రులను వదిలి..హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లలో కోచింగ్ తీసుకొని ఎంతో కష్టపడ్డారని..కానీ తీరా పరీక్షా రాస్తే..అవి కాస్త లీక్ అవ్వడం వారిని జీవితాలను అయోమయం చేశాయని ఆవేదన వ్యక్తం చేసారు. 2014లో మోడీని కలిసి, దక్షిణ భారతంలో ఎవరు ఉన్నా.. లేకున్నా.. తాను అండగా ఉంటానని చెప్పానన్నారు. తనకు అన్ని పార్టీల నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయని… కానీ, స్నేహం వేరు.. రాజకీయాలు వేరని… అవినీతిపై పోరాడే వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తిరిగానని.. తెలంగాణలో ఉన్న పోరాట స్పూర్తి.. దేశం మొత్తం ఉండుంటే అవినీతి ఎప్పుడో పారిపోయేదని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే భూముల ధరలు పెరిగాయన్నారు. జిల్లాల్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. కౌలు రైతుల్ని చులకనగా చూడొద్దన్నారు. గత పాలకులు చేసిన తప్పే తిరిగి తెలంగాణలో పునరావృతం అవుతోందన్నారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా బీజేపికి మద్దతు ఇవ్వాలని కోరారు.
పవన్ కళ్యాణ్ మీద పాత చెప్పులు 👞 విసిరిన
తెలంగాణ ప్రజలు 🤣 🤣#PackageStarPK pic.twitter.com/9129y7UBab— Anitha Reddy (@Anithareddyatp) November 23, 2023
Read Also : Whats Today : తెలంగాణలో అమిత్‌షా, రాజ్‌నాథ్, హిమంత, ప్రియాంక, డీకేఎస్ ప్రచారభేరి