CM Revanth Reddy : సీఎం రేవంత్ కు చంద్రబాబు శుభాకాంక్షలు
రేవంత్ రెడ్డి కి టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు అందజేశారు
- By Sudheer Published Date - 05:34 PM, Thu - 7 December 23

తెలంగాణ (Telangana) రెండో సీఎం (2nd CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయుడు సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు అందజేశారు. ప్రజలకు సేవ చేయడంలో విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే ఎపి సీఎం జగన్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డి పై 14694 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్ రెడ్డి 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా పని చేసి 2018 అక్టోబరులో టీడీపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Congratulations to Anumula Revanth Reddy Garu on being sworn in as the Chief Minister of Telangana. I wish him a successful tenure in service to the people. @revanth_anumula pic.twitter.com/xoi4EWmjWt
— N Chandrababu Naidu (@ncbn) December 7, 2023
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023