CBN High Tech : ట్రిపుల్ ఐటీ ఉత్సవాలకు చంద్రబాబు, విజన్ 2020 ఫలం
CBN High Tech : తెలుగుదేశం పార్టీ అధినేత 25ఏళ్ల క్రితం విజన్ ఇప్పుడు ఫలాలను ఇస్తోంది. ఆస్వాదిస్తోన్న వాళ్లు చంద్రబాబును మరువలేదు.
- Author : CS Rao
Date : 22-08-2023 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
CBN High Tech : తెలుగుదేశం పార్టీ అధినేత 25ఏళ్ల క్రితం వేసిన విజన్ ఇప్పుడు ఫలాలను ఇస్తోంది. వాటిని ఆస్వాదిస్తోన్న వాళ్లు చంద్రబాబును మరువలేదు. ఆయన్ను గుర్తించుకుని గౌరవంగా ఆహ్వానిస్తోంది. ఆ కోవలోకి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ కూడా వస్తుంది. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల జరుపుకుంటోన్న ఆ సంస్థ చంద్రబాబు కోసం ఎదురుచూస్తోంది. ఈనెల 23న ఆయన సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడతారు.
ట్రిపుల్ ఐటీ ఉత్సవాలకు చంద్రబాబు (CBN High Tech)
ఇటీవల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐ ఎస్ బీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ స్కూల్) సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు (CBN High Tech)చంద్రబాబు హాజరయ్యారు. ఆయన్ను ముఖ్య అతిథిగా ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఆహ్వానించింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం చంద్రబాబు హయాంలో ఏర్పడిన సంస్థ అది. దాని కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నం చేశారు? అనేది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో యాజమాన్యం గుర్తు చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐ ఎస్ బీ ని తీసుకురావడానికి చంద్రబాబు 25ఏళ్ల క్రితం చేసిన కృషిని కొనియాడారు. ఆనాడు ఆయన పడ్డ తపన గురించి ప్రశంసించారు. ఇదే వేడుకలకు ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతేకాదు, ఐ ఎస్ బీ శంకుస్థాపనకు అప్పట్లో ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ హాజరయ్యారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఎదుగుతూ వచ్చిన ఐఎస్ బీ ప్రపంచ స్థాయికి ఎలా వెళ్లిందో కళ్లకట్టినట్టు ఉత్సవాల్లో చూపించారు.
చంద్రబాబు రెండు దశాబ్దాల క్రితం వేసిన బీజం
అంతర్జాతీయ సంస్థలను తీసుకురావడానికి చంద్రబాబు 25ఏళ్ల క్రితం పడిన శ్రమ ఇప్పుడు తెలంగాణ సమాజానికి (CBN High Tech)సిరులు కురిపిస్తోంది. ఒకప్పుడు రాళ్లు, రప్పలతో ఉండే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎకరం 100 కోట్లకు ప్రస్తుతం ప్రభుత్వం విక్రయిస్తోంది. ఆ ధరలు పలకడానికి కారణం చంద్రబాబు రెండు దశాబ్దాల క్రితం వేసిన బీజం. దాన్ని ఎవరూ కాదనలేరని మంత్రి కేటీఆర్ ఒకానొక సందర్భంలో ప్రశసించారు. కానీ, ఇప్పుడున్న నేతలు చంద్రబాబు గురించి చాలా మంది చులకనగా మాట్లాడుతుంటారు. వాళ్ల విజ్ఞతకే వదిలేస్తూ చంద్రబాబు ఆయన వేసిన అభివృద్ధి బీజాలు ఇప్పుడు వృక్షాలుగా మారడాన్ని చూసి తరించిపోతున్నారు. అలాంటి సందర్భం ట్రిపుల్ ఐటీ రూపంలో ఇప్పుడు వచ్చింది.
Also Read : CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా యాజమాన్యం కొన్ని రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశాన్ని ఈనెల 23వ తేదీన ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలోనే, 1998లో హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ఏర్పాటైంది. ఇటీవల ఐ ఎస్ బీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో సేదతీరిన చంద్రబాబు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ ఉత్సవాల్లో పాలుపంచుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధిని ఆస్వాదిస్తోన్న విద్యార్థులతో మాట్లాడబోతున్నారు. ఇదో మధురక్షణంగా ఆయన భావిస్తున్నారు. అంతేకాదు, టీడీపీ క్యాడర్ తమ నాయకుని విజన్ (CBN High Tech) గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇదో రోల్ మోడల్ గా కనిపిస్తోంది.
Also Read : CBN Raksha Bandhan : చంద్రన్న రాఖీలు వచ్చేస్తున్నాయ్..!