Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Author : Balu J
Date : 07-03-2023 - 11:38 IST
Published By : Hashtagu Telugu Desk
భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక వివాదం ముగిసిపోక ముందే తాజాగా మరోసారి వివాదంలోకి ఎక్కారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను తన అనుచరులు చంపేస్తారంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ గా మారింది.
ఈ క్రమంలో కోమటిరెడ్డిపై చెరుకు సుధాకర్, కొడుకు సుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీసీ 506 కింద పోలీసులు కోమటిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. తమను చంపుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరింపులకు గురి చేశారని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన డాక్టర్ చెరుకు సుధాకర్ కొడుకు డాక్టర్ సుహాస్ ఫిర్యాదు మేరకు కేసు (Police Case) నమోదైంది.
Also Read: Bill Gates: ఎలక్ట్రిక్ ఆటోలో దూసుకెళ్లిన బిల్ గేట్స్.. వీడియో వైరల్