HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cabinet Meeting On November 23

Telangana Cabinet Meeting : నవంబర్ 23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

Telangana Cabinet Meeting : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయకపోవడంతో ప్రభుత్వం ఎదురుదెబ్బ

  • Author : Sudheer Date : 17-10-2025 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Government moves towards new reforms.. Cabinet files into digital form
Government moves towards new reforms.. Cabinet files into digital form

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయకపోవడంతో ప్రభుత్వం ఎదురుదెబ్బ తిన్నట్టైంది. ఈ పరిణామం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన చర్చా విషయంగా మారింది. హైకోర్టు తీర్పు కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడినందున, ఎన్నికలు ఆలస్యమవకుండా పరిష్కార మార్గాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది.

‎Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!

ప్రస్తుత సమాచారం ప్రకారం.. మంత్రుల్లో ఎక్కువమంది రేవంత్‌రెడ్డికి పార్టీ స్థాయిలోనే 42 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఎన్నికలకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కోర్టు ఆంక్షల పరిధిలో అధికారికంగా అమలు చేయలేకపోయినా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో బీసీ సమాజానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావన వ్యక్తమైంది. దీంతో చట్టపరమైన అడ్డంకులు లేకుండా బీసీ సమాజానికి న్యాయం చేయడమే కాకుండా రాజకీయంగా కూడా బలమైన సందేశం ఇవ్వాలనే వ్యూహం చర్చలోకి వచ్చింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా రేవంత్‌రెడ్డి పార్టీ అంతర్గతంగా అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇకపోతే, ఈ నెల 19న జరగబోయే టీపీసీసీ పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై తుది చర్చ జరగనుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని ఆధారంగా చేసుకొని, 23న మరోసారి క్యాబినెట్ సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామాలతో బీసీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజానికి చేసిన హామీలను ఎంతవరకు నెరవేర్చగలదో, కోర్టు పరిమితుల్లో ఎంతవరకు రాజకీయ వ్యూహం అమలు చేయగలదో అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bc reservation announcement
  • cm revanth
  • November 23rd
  • telangana cabinet meeting

Related News

Harish Rao Movie Tickets

స్కామ్ లేదంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేసారంటూ హరీష్ రావు సూటి ప్రశ్న

నైనీ బొగ్గు గని టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువుల హస్తం ఉందనేది హరీశ్ రావు ప్రధాన ఆరోపణ. గతంలో పిలిచిన టెండర్లను అకస్మాత్తుగా రద్దు చేయడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

  • Cm Revanth T Hub

    టీ-హబ్‌ విషయంలో సీఎం రేవంత్ వెనకడుగు, కారణం ఏంటి ?

  • Minister Uttam Kumar Reddy

    త‌ప్పుడు వార్త‌ల‌ను న‌మ్మ‌కండి: మంత్రి ఉత్త‌మ్

Latest News

  • 40 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 4 సార్లు మాత్రమే ఆలౌట్‌!

  • మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

  • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

  • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

  • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

Trending News

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd