Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!
Dhanteras 2025: ధన త్రయోదశి రోజున పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయకూడదని వాటి వల్ల లేనిపోని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:00 AM, Fri - 17 October 25

Dhanteras 2025: ఐదు రోజుల దీపావళి పండుగ మొదట ధన్ తేరాస్ తో ప్రారంభం అవుతుంది అన్న విషయం తెలిసిందే. దీనిని ధన త్రయోదశి అని పిలుస్తారు. ప్రతీ ఏడాది ఆశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలోని పదమూడవ త్రయోదశి తిథిని ధన్ తేరాస్ జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ రోజున కొత్త వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ధన్ తేరాస్ నాడు షాపింగ్ చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం.
ఇకపోతే ఈ ఏడాది ధన త్రయోదశి పండగను అక్టోబర్ 18వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. అయితే ధన్ తేరస్ నాడు కొన్ని వస్తువులు కొనడం నిషేధించబడింది. ముఖ్యంగా ఏడు వస్తువులను అస్సలు కొనకూడదని చెబుతున్నారు. ఎందుకంటె ఈ వస్తువులను కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. ఇంట్లోకి పేదరికం వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ధన్‌తేరాస్ నాడు లోహం కొనడం సంప్రదాయంగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇనుప వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుందట.
ఇనుము శని దేవుడికి సంబంధించినది కాబట్టి, ధన్‌తేరాస్ నాడు ఇనుము కొనడం దురదృష్టాన్ని తెస్తుందట. ధన్‌తేరాస్ నాడు స్టీల్ పాత్రలు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయకూడదట. కాబట్టి ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకుండా ఉండటం మంచిది. అలాగే గాజును రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు. కాబట్టి ధన్ తేరాస్ రోజున గాజుతో చేసిన వేటినీ కొనకూడదట. ఎందుకంటే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుందని చెబుతున్నారు. ధన్‌తేరాస్ నాడు సూదులు, కత్తెరలు, కత్తులు వంటి పదునైన లేదా కోణాలు ఉన్న వస్తువులను కొనకూడదట.
ఈ రోజున ఇంట్లోకి పదునైన వస్తువులను తీసుకురావడం వల్ల దురదృష్టం, ప్రతికూలత వస్తుందట. అదేవిధంగా ధన్‌తేరాస్ నాడు పాత్రలు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఈ రోజున ఇంట్లోకి ఖాళీ పాత్రలను తీసుకువెళ్ళకుండా జాగ్రత్త వహించాలట. ఖాళీ పాత్రలు ఇంట్లో శూన్యతను సూచిస్తాయని చెబుతున్నారు. ధన్‌తేరాస్ నాడు నల్లని వస్తువులను కొనకూడదట. నల్లని వస్తువులను అశుభకరమైనవిగా భావిస్తారు. కాబట్టి ధన్‌తేరాస్ రోజు నల్లని వస్తువులు లేదా దుస్తులు కొనుగోలు చేయకూడదట. ధన్‌తేరాస్ నాడు నూనె, నెయ్యి కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. మీకు అవి అవసరమైతే ధన్‌తేరాస్ కు ఒక రోజు ముందు వాటిని కొనుగోలు చేయవచ్చు. ధన్‌తేరాస్ నాడు నూనె, నెయ్యి కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చట.