HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >C V Anand Returns As Hyderabad Police Commissioner

C.V. Anand Returns : హైదరాబాద్ సీపీగా మరోసారి సీవీ ఆనంద్

C.V. Anand returns : హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. స‌రిగ్గా ఏడాది క్రితం వ‌ర‌కు ఆనంద్.. హైద‌రాబాద్ సీపీగా సేవ‌లందించారు

  • Author : Sudheer Date : 07-09-2024 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
C.v. Anand Returns As Hyder
C.v. Anand Returns As Hyder

C.V. Anand returns as Hyderabad police commissioner : తెలంగాణ(Telangana)లో మరోసారి ఐపీఎస్ అధికారులు బదిలీల (Transfer of IPS Officers
) పర్వం కొనసాగింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ (C.V. Anand) మరోసారి నియమితులయ్యారు. స‌రిగ్గా ఏడాది క్రితం వ‌ర‌కు ఆనంద్.. హైద‌రాబాద్ సీపీగా సేవ‌లందించారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కు హైద‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు. తెలంగాణ కేడ‌ర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదన‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసుగా ప‌దోన్న‌తి పొందారు. కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిన ఆయ‌న 2021లో తిరిగి తెలంగాణ‌కు చేరుకున్నారు. 2023 ఆగ‌స్టులో డీజీపీ హోదా క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2023 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇప్పుడు మ‌ళ్లీ హైద‌రాబాద్ సీపీగా నియామ‌కం అయ్యారు.

ఇదిలా ఉంటె గణేష్ నవరాత్రుల సందర్బంగా ఈరోజు నుండి హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 17వ తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఖైరతాబాద్‌ వినాయకుని పరిసర ప్రాంతాలు ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడ్‌, మింట్‌కాంపౌండ్‌లో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

Traffic Restrictions in Hyderabad for 10 Day Ganesh Festival :

ఖైరతాబాద్‌ వినాయక విగ్రహం నుంచి రాజీవ్‌ గాంధీ విగ్రహం మీదుగా మింట్‌ కాంపౌండ్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.

పాత సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఖైరతాబాద్‌ గణేష్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ రాజ్‌దూత్‌ లైన్‌లోకి అనుమతించరు.

ఇక్బాల్‌ మినార్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ లేన్‌ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ అనుమతించరు.

ఎన్టీఆర్‌ మార్గ్‌, ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోడ్‌ నుంచి మింట్‌ కాంపౌండ్‌ వైపు వచ్చే సాధారణ వాహనాలకు ప్రవేశం లేదు.

నెక్లెస్‌ రోటరీ వద్ద తెలుగు తల్లి జంక్షన్‌ లేదా ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ వైపు నిరంకారి నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌కు అనుమతిలేదు.

ఖైరతాబాద్‌ పోస్టాఫీస్‌ లేను ఖైరతాబాద్‌ రైల్వే గేటు వైపు అనుమతించరు.

నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా ఖైరతాబాద్‌ బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు వాహనాల కోసం ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలం, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ స్థలాలు,
ఐమాక్స్ ఎదురుగా, సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ంగ్‌ సదుపాయం కల్పించారు.

Read Also : Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cp cv anand
  • Ganesh festival
  • hyderabad
  • IPS officers
  • traffic restrictions

Related News

KTR

ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

కేటీఆర్ ట్వీట్ చేస్తూ, “నిన్న రాత్రి, హైదరాబాద్, వరంగల్, వైజాగ్, విజయవాడ, నాగ్‌పూర్‌లకు చెందిన 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులతో ఏకాంతంగా చర్చించే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణలో మౌలిక సదుపాయాలు, పరిపాలన, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయాణాలపై చర్చ జరిగింది.” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కేటీఆర్, పాత కథనాలనే పునరావృతం చేయడం, తప్పుడు ఘనతను

  • Zepto

    Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd