HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bumper Offer For Passengers Tsrtc Introuduced New Palle Velugu Town Bus Pass

TSRTC: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”

ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

  • Author : Balu J Date : 17-07-2023 - 1:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSRTC
TSRTC

ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్‌ పాస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్ ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”ను సంస్థ తెచ్చింది.

హైదరాబాద్‌ లోని బస్‌ భవన్‌లో సోమవారం “పల్లె వెలుగు టౌన్‌ బస్‌ పాస్‌” పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. “జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేస్తున్నాం.

ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్ లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. ఈ బస్ పాస్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Also Read: Chandrababu Naidu: ఓటు అందరి బాధ్యత, ఓటుతోనే భవిష్యత్తుకు భద్రత: చంద్రబాబు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bus passengers
  • telangana
  • tsrtc
  • VC Sajjanar

Related News

Rythubharosa Money

Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధుల పంపిణీకి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు

  • Chicken Price Hike

    Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ధర ఎంతంటే…

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    Telangana : తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది – బండి సంజయ్

  • 10th Exams

    10th Exams : తెలంగాణలో ఇకపై పదో తరగతి పరీక్షలు ఉండవు – సీఎం రేవంత్ కీలక నిర్ణయం

  • Telangana Traffic Challan

    Telangana Traffic Challans: ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్.. చలాన్ కట్టకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్

Latest News

  • యుద్ధంపై ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు సిద్ధమవ్వండి!

  • Madhira: మధిర కోల్డ్‌ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు

  • Roja: తమిళ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రోజా!

  • Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

Trending News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

    • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

    • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

    • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd