HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Will Win Secunderabad Parliament Segment

KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచేది గులాబీ పార్టీనే..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

  • Author : Balu J Date : 01-04-2024 - 9:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Response On Assembly El
Ktr Response On Assembly El

KTR: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో ప్రజల చేతిలో తిరస్కారానికి గురైన తర్వాత, అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారన్నారు. గెలిచిన తర్వాత అటు అంబర్పేట్ నియోజకవర్గానికి గాని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కానీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే గత ఐదు సంవత్సరాలలో తీసుకువచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి ఈ ఎన్నికల్లో ఓట్లు అడగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.

గత ఎన్నికల్లో అనుకోకుండా గెలిచిన కిషన్ రెడ్డి, ఈసారి మాత్రం కచ్చితంగా ప్రజల చేతులు మరోసారి తిరస్కారానికి గురవుతారని, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆయన ఓటమి ఖాయమని కేటీఆర్ అన్నారు. 10 సంవత్సరాలలో హైదరాబాద్ నగరానికి తమ పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకొని, తమ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గెలిచిన తర్వాత అధికారం కోసం ఢిల్లీకి పర్యటనలు చేసే నాయకులను కాకుండా, నిత్యం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్మారావు గౌడ్ లాంటి ప్రజా నాయకులు నియోజకవర్గానికి అవసరమని కేటీఆర్ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత రాష్ట్ర సమితికి కంచుకోటగా మారిన రాజధానిలో ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ తెలిపారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ మద్దతుగా అంబర్ పెట్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్రను నిర్వహించారు. అంబర్పేటలోని పటేల్ నగర్ ప్రాంతంలోని ప్రేమ్ నగర్ చౌరస్తా నుండి ఆజాద్ నగర్ , పటేల్ వాడలలో ఇంటింటికి తిరిగి పద్మారావు గౌడ్ ను ఎం.పి గా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ జై తెలంగాణ అంటూ నినాదాలతో మార్మోగించిన పటేల్ నగర్ ప్రాంత వాసులు, కేటీఆర్ తో ముచ్చటించారు. తన పాదయాత్రలో భాగంగా పలువురు ఇళ్లకు వెళ్లడంతోపాటు, మార్గమధ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కేటీఆర్ పలకరించుకుంటూ తన పాదయాత్రను ముందుకు నడిపించారు. మిర్చి బండి , కిరాణా షాప్ వంటి వాటిలో ఉన్న వారితో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ తో మాట్లాడిన వందల మంది ప్రజలు కూడా మళ్లీ తెలంగాణ పార్టీకి ఓటు వేసి బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ నే గెలిపించుకుంటామని ఓటర్లు కేటీఆర్ కు తెలిపారు. ఉద్యమకారుడు , అందరి మధ్యలో ఉంటూ, అందరికి సూపరిచితుడు అయిన పజ్జన్న ను గుర్తుపెట్టుకోవాలని ఓటర్లను కేటీఆర్ అభ్యర్థించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • kishan reddy
  • ktr
  • secundrabad

Related News

Mallareddy says goodbye to BRS

Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలి సమాధానాలు, విలక్షణమైన ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి.. త్వరలోనే బిఆర్ఎస్ (BRS) పార్టీని వీడనున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని వారాలుగా ఆయన పార్టీ అధిష్ఠానానికి, ముఖ్యంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో జరుగుతు

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • Election Commission deals a blow to Kavitha's party; 'Telangana Rakshana Sena' name must be changed.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • High drama at Telangana Bhavan; former minister Harish Rao taken into police custody.

    Harish Rao: తెలంగాణభవన్‌ వద్ద హైడ్రామా.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి హరీష్‌ రావు

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd