BRS Story : కేసీఆర్ కథ అడ్డం తిరిగిందక్కడే.! బీఆర్ఎస్ వెనుక లెక్కలెన్నో..!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆషామాషీగా బీఆర్ఎస్ ( BRS Story) స్థాపించలేదు.
- By CS Rao Published Date - 01:06 PM, Fri - 13 January 23

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆషామాషీగా బీఆర్ఎస్ ( BRS Story) స్థాపించలేదు. కుమారుడు కేటీఆర్ (KTR)ను సీఎం చేయడం కోసం స్పేస్ క్రియేట్ చేయడం బీఆర్ఎస్ వెనుక ఉన్న మొదటి అంశం. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ కావడం రెండో ఆలోచన. కనీసం డిప్యూటీ పీఎంగా అయినా ఫోకస్ కావాలి? అనేది మూడో అంశం. ఇక బీజేపీతో ఉన్న మైత్రిబంధాన్ని కొనసాగించాలంటే జాతీయ పార్టీ ఉండాలి? అనేది లాస్ట్ ఆప్షన్. ఇన్ని ఆలోచనలతో (BRS Story) ఏర్పడిందని ఆలస్యంగా పార్టీ వర్గాల నుంచి బయటకు వస్తోంది.
కేసీఆర్ ఆషామాషీగా బీఆర్ఎస్ ( BRS Story)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చావుదప్పి కన్ను లొట్ట బోయినట్టు టీఆర్ఎస్ గెలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ దూకుడును చూసి ఇక ఉపేక్షిస్తే అసలుకే ఎసరు వస్తుందని కేసీఆర్ భావించారు. దేశమంతా తిరిగి, మూలన పడేసిన బీఆర్ఎస్ ను బూజు దులిపి బైటకు తీసారు. తెలంగాణాలో బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీకి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళాలంటే ఏదో ఒక ఆరోపణలు కావాలి . అందుకు కవిత ఉదంతాన్ని ఆ పార్టీ నేతలు చక్కగా వాడుకున్నారు. దీంతో కులాల లెక్కలుగా వేసుకుని , కొత్త పార్టీలను కేసీఆర్ పెట్టించాడని టాక్ ఉంది. ఓట్లను చీల్చే ఎత్తుగడను వేశారు. షర్మిల పార్టీ గానీ , బలహీన వర్గాల ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ బీఎస్పీ గానీ, కులాల ఓట్లను చీల్చడం ద్వారా కేసీఆర్ లాభపడతారు. కానీ అనూహ్యంగా బీజేపీ దూకుడు పెంచడంతో కధ అడ్డం తిరిగింది.
Also Read : BRS Meeting : బీఆర్ఎస్ కు కౌంట్ డౌన్! కేసీఆర్ ఖమ్మం సభ అలజడి!
జాతీయ పార్టీ బీఆర్ఎస్ స్థాపన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆవేశ పూర్వక నిర్ణయం అంతకంటే కాదు . దానివల్ల బహుముఖ ఉపయోగాలు కేసీఆర్ కు ఉన్నాయి. మొదటిది కవిత కేసును నీరుగార్చడం. జాతీయ పార్టీ పేరు మీద ఢిల్లీ తరచుగా సందర్శించడం. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నా అంటూ రాష్ట్ర పార్టీ సారధ్యం కేటీఆర్ చూస్తాడని సంకేతాలు ఇచ్చారు. ఒక వేళ కేంద్రంలో చక్రం తిప్పవల్సిన పరిస్థితి వస్తే , ప్రధాని అభ్యర్ధిగా పోటీలో ఉండడం , కనీసం డిప్యూటీ ప్రధానిగా నైనా ఎన్నికయ్యేటట్లు చూసుకోవడం , అన్నింటా కాంగ్రెస్, బి జె పి ల కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో దోబూచులాడడం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలోని ఆంతర్యాలు.
బీఆర్ఎస్ మొదటి ప్రచారాన్ని ఖమ్మం నుండీ
బీఆర్ఎస్ మొదటి ప్రచారాన్ని తెలంగాణాలోని ఖమ్మం నుండీ మొదలు పెట్టడం వెనుక కూడా వ్యూహం ఉంది . ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్ లో ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఖమ్మంలో చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యింది. వీటన్నిటినీ మొగ్గదశ లోనే ఉక్కు పాదంతో అణచి వేయడానికి ఖమ్మంను ఎన్నుకున్నారు. అక్కడి సభలో తెలంగాణా పధకాలు దేశమంతా అమలు చేస్తానని చెబుతారని తెలుస్తోంది. రైతు బంధునే తీసుకుంటే తెలంగాణాలో రైతుకు ఉన్న ప్రతి ఎకరానికి , ఎన్ని ఎకరాలు ఉంటే అన్నిటికీ ఎకరా 10 వేల చొప్పున రైతు బందు అమలు చేస్తున్నారు.
Also Read : Shock to BRS: బీఆర్ఎస్ కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి?
భారత దేశంలో ఏ ప్రభుత్వమూ ఇలా అమలు చేయడం లేదు. ఎ.పి గాని , కేంద్ర ప్రభుత్వం గానీ ఒక్క ఎకరం ఉన్నా , పది ఎకరాలు ఉన్నా పంపిణీ చేసేది కుటుంబ మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుని 12 వేలు ఇస్తున్నారు . ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరువేలు ఇస్తోంది . అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్ళు , యస్. సి ల దళిత బందు పదిలక్షల పధకం , బి సి లకు అందించే గొర్రెలు , పశువులు అందించే పధకాలు భారత్ అంతటా అమలు చేస్తానని కేసీఆర్ చెబుతారు. తెలంగాణాలో ఏ ఒక్క కేంద్ర పరిశ్రమని అమ్మేందుకు గాని , దౌర్జన్యంగా సంస్థలను ఆక్రమించు కునేందుకు గానీ కేసీఆర్ అవకాశం ఇవ్వడం లేదు. ఇది బీజేపీకి ఇబ్బందిగా ఉంది .
Also Read : BRS Party : బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు!
హైద్రాబాద్ ను విస్తరించు కుంటూ, ఐ టి రంగ విస్తరణకు , కొత్త పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులు ఇస్తూ కేసీఆర్ దూసుకు పోతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల పార్టీల నేతలు కేసీఆర్ ను నమ్మడం లేదని తెలుస్తోంది. విభజన వాదిగానే చూస్తున్నారు. ఎప్పుడు ఎవరితో సఖ్యతగా ఉంటాడో , ఎప్పుడు తిట్టి విడివడతాడో తెలియదని చెబుతున్నారు. ఇంతకాలం వాడుకున్న బిజెపి ఇప్పుడు కేసీఆర్ పై విమర్శలకు పదును బెట్టింది.
టీడీపీ ఓట్లు బీజేపీకి అవసరం
ఇప్పుడు తెలంగాణా లో బీఆర్ఎస్, బీజేపీ లకు టీడీపీతోటి అవసరం ఏర్పడింది. అధికారం నిల్పుకోవాలి అంటే సెటిలర్స్ ఓట్లు అవసరం. బీఆర్ ఎస్ ను తెలంగాణాలోనే నిలువరించాలంటే టీడీపీ ఓట్లు బీజేపీకి అవసరం. ఇంతకాలం తోడు దొంగల్లా వ్యవరించిన బీఆర్ఎస్, బీజేపీ లు బద్ధ శతృవులుగా మారి దేశం మీద పడ్డారు. చంద్రబాబు నిజామాబాద్ జిల్లా పర్యటన తరువాత గానీ తెలంగాణాలో టీడీపీ స్టాండ్ ఏమిటో తెలుస్తుంది. జాతీయ పార్టీ పెట్టడం అంటే అషా , మాషీ వ్యవహారమా, నిధులు ఎక్కడి నుండీ వస్తున్నాయి , ఏ ఏ రాష్ట్రాలకు ఎన్నికల్లో నిధులు ఎంతెంత ఇచ్చావో , ఇవ్వబో తున్నావో త్వరలో లెక్కలు చెబుతామని బీజేపీ నేతలు కేసీఆర్ మీద మండిపడుతున్నారు. ఇదే తరహాలో ఎ.పి ప్రభుత్వ పెద్ద నుండి కూడా బిజెపి ఎంతెంత లబ్ధి పొందుతోందో బీఆర్ఎస్ బైటపెడితే బాగుంటుందేమో!