HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Parliamentary Party To Merge With Bjp Party

BRS Rajyasabha MPs : ఇక ఎంపీల వంతు వచ్చేసింది..’కారు’ ఖాళీ అవ్వాల్సిందేనా..?

బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Author : Sudheer Date : 12-07-2024 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
brs parliamentary party to merge with bjp
brs parliamentary party to merge with bjp

తెలంగాణ లో బిఆర్ఎస్ పార్టీ (BRS) పరిస్థితి రోజు రోజుకు దారుణంగా తయారవుతుంది. పదేళ్ల పాటు తిరుగులేని పార్టీ గా గుర్తింపు తెచ్చుకున్న బిఆర్ఎస్.. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు అటు ఢిల్లీ లోను పార్టీ పేరు కూడా వినపడని పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసి కేవలం 39 స్థానాలు సాధించి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ప్రజలు ఇంత వ్యతిరేకంగా ఉన్నారా..అని ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ షాక్ కు గురయ్యారు. ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు..మార్పులు చెయ్యండి..సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చండి..నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి..రైతుల రుణమాఫీ చెయ్యండి అంటూ విశ్లేషకులు, పార్టీ నేతలు మొదటి నుండి చెపుతూ వస్తున్నప్పటికీ కేసీఆర్ (KCR)..ఏమాత్రం లెక్క చేయకుండా మొండిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాడు. ఫలితాల్లో బిఆర్ఎస్ ఓటమి ఖాయమని గ్రహించిన చాలామంది నేతలు..ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) లో చేరి..టికెట్స్ సాధించుకొని విజయం సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఫలితాలు అనంతరం కూడా వరుసగా బిఆర్ఎస్ నేతలు బయటకు రావడం స్టార్ట్ చేసారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. సాధారణ నేతలే కాదు కేసీఆర్ కు అత్యంత దగ్గరి వారు సైతం బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు గెలిచినా కొద్దీ మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాట పడుతున్నారు. ఇప్పటీకే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా..మరికొంతమంది కూడా చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. దీంతో కేంద్రంలోని బీజేపీ కూడా బిఆర్ఎస్ ఎంపీల ఫై దృష్టి సారించింది. బిఆర్ఎస్ లో లోక్‌సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెపుతూ వస్తున్నారు.

బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేవలం ఇద్దరు రేణుఖ చౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు మాత్రమే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బిఆర్ఎస్ నలుగురు ఎంపీలు బీజేపీలో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీఫ్ ధన్ ఖడ్ తో సమావేశం అయ్యారు. విలీన అంశంపై చర్చలు జరిపారని అంటున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ కు తెలుసనీ..ఆయన ఆమోదం తోనే బిజెపి లో విలీనం జరుగుతుందని వినికిడి. ఏది ఏమైనప్పయికి వరుస నేతలు పార్టీని వీడడం మాత్రం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నింపుతుంది.

Read Also : Prakash Goud : కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs mps
  • brs parliamentary party to merge

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd