Singareni : సింగరేణి మెడపై కేంద్రం కత్తి పెడితే..కాంగ్రెస్ సానబెడుతోంది – కేటీఆర్
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు
- By Sudheer Published Date - 05:53 PM, Thu - 20 June 24

సింగరేణి (Singareni ) వేలం పాటకు కేంద్రం సిద్ధం కావడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేసారు. సింగరేణి గనులు దక్కకపోవడానికి కారణం బిఆర్ఎస్, బిజెపియే కారణమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి కుమ్మకై కావాలనే సింగరేణి గనులను కేటాయించడం లేదంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గు గనులను వేలం వేయొద్దని 2021, డిసెంబర్ 8న కేంద్రానికి నాటి సీఎం కేసీఆర్ లేఖ ను కేటీఆర్ గుర్తు చేసారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి బొగ్గు గనులను అప్పగించాలని లేఖలో పేర్కొన్నారు. బీహార్‌లోని చెస్నా అనే ప్రాంతంలో ఆనాడు బొగ్గు బావిలో ప్రమాదం జరిగి వందల మంది కార్మికులు చనిపోయారు. నాటి కేంద్ర ప్రభుత్వం.. బొగ్గు గనులు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల కిందనే ఉండాలని, ఉంటేనే రక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి, 1975 – 76 లో నాటి కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ లేఖ రాశారు. ప్రస్తుతం సింగరేణిలో 51 శాత రాష్ట్రం వాటా, 49 శాతం కేంద్ర వాటా ఉంది. కాబట్టి సింగరేణికే బొగ్గు గనులు కేటాయించాలని కేసీఆర్ అడిగారు. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసెంబర్ 11, 2021.. ప్రధానికి లేఖ రాశారు. నాలుగు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలి. వేల మంది వర్కర్లు రోడ్డున పడుతారని చెప్పారు. కానీ ఇవాళ బొగ్గు గనుల వేలంలో పాల్గొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేత చెప్పించారని కేటీఆర్ గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఒకవేళ బొగ్గు గనుల కేటాయింపు జరగకపోతే సింగరేణి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. గనుల కేటాయింపు జరగనందునే విశాఖ స్టీల్ ప్లాంటులో కార్యకలాపాలు స్తంభించాయని, ప్రైవేట్ పరం అయ్యే స్థితికి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో సింగరేణి కూడా ప్రైవేట్ పరం కావొచ్చని అన్నారు.. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే.. కేసీఆర్ 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అని మొత్తుకున్నారు. కేంద్రంలో నిర్ణయాత్మక పాత్రలో ఉంటామని చెప్పారు. 16 ఎంపీలతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలా మంది చాలా మాట్లాడారు. కానీ ఈరోజు ఏపీలో ఆ 16 ఎంపీ సీట్లతోనే టీడీపీ నిర్ణయాత్మక పాత్రలో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిపోయింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఈరోజు హైదరాబాద్‌లో బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారని కేటీఆర్ తెలిపారు.
మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా ఏ టెండర్, వేలం లేకుండా.. ఒడిశాలో రెండు గనులను నైవేలి లిగ్నైట్ లిమిటెడ్‌కు అప్పగించారు.
గుజరాత్‌లో గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, గుజరాత్ ఇండస్ట్రీ పవర్ లిమిటెడ్‌కు 2015 సంవత్సరంలో ఐదు కోల్… pic.twitter.com/aez6SJeCHq
— BRS Party (@BRSparty) June 20, 2024
Read Also : Kodali Nani : ఓటర్లు ఓడగొట్టిన కొడాలి నానికి బుద్ది రావడం లేదు