BRS Leader Harish Rao: లక్ష తప్పుడు కేసులు పెట్టించినా.. నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను: హరీష్ రావు
మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.
- Author : Gopichand
Date : 03-12-2024 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
BRS Leader Harish Rao: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చాలా హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (BRS Leader Harish Rao) పైన పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ తో కలిసి తన ఫోన్లు ట్యాపింగ్ లకు పాల్పడ్డారని, తనపై అక్రమ కేసులు బనాయించి, మానసికంగా వేధించారని కూడా సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు.. 120(బి), 386, 409, 506, రెడ్ విత్ 34 , ఐటీ యాక్ట్ చట్టాల కింద కేసు నమోదైంది.
Also Read: Taj Mahal : తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. ముమ్మర సోదాలు
మిస్టర్ @revanth_anumula
అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.
నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…
— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024
మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు అని ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డు మీద ఈకలు పీకి, తలా తోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను అని ట్వీట్ చేశారు.