HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Break To Congress Schemes In Telangana

MLC Elections 2025 : తెలంగాణ లో కాంగ్రెస్ పథకాలకు బ్రేక్

MLC Elections 2025 : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది

  • Author : Sudheer Date : 30-01-2025 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Break To Congress Schemes I
Break To Congress Schemes I

ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం (Congress) అమలు చేయలేదని ప్రతిపక్షాలు , ప్రజలు విమర్శలు కురిపిస్తున్న వేళ..ఇప్పుడు ప్రభుత్వానికి మరో షాక్ ఎదురైంది. అతి త్వరలోనే పలు పథకాలను అమలు చేయాలనీ కసరత్తులు మొదలుపెట్టగా..ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీముల ప్రారంభానికి బ్రేక్ పడింది. అయితే, ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు యథావిధిగా కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కొన్ని ముఖ్యమైన సంక్షేమ పథకాలు ప్రజలకు నిరంతరంగా అందుతాయని తెలిపారు.

CM Revanth Reddy : ఫిబ్రవరి 10 లోగా స‌మ‌గ్ర ప‌ర్యాట‌క విధానం రూపొందించాలి..

ఈనెల 26న ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రైతు భరోసా వంటి పథకాలు యథావిధిగా అమలవుతాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోకుండా, ఈ పథకాలను నియంత్రణ కోడ్‌లో భాగంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల కమిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం కొత్త పథకాలను ప్రవేశపెట్టడం ఇప్పుడు సాధ్యం కాదని పేర్కొంది.

ఫిబ్రవరి 27న రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మోడల్ కోడ్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కొత్త ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు, కొత్త ప్రాజెక్టుల ఆరంభం వంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని పథకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే మంజూరైన పథకాలకు ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు.

తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS), ఇతర పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తెలుస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • break
  • congress schemes
  • MLC Elections 2025
  • telangana

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

  • One Lakh New Pensions In Te

    New Pension : తెలంగాణలో పెన్షన్లకు భారీ ప్రక్షాళన .. కొత్తగా లక్ష పెన్షన్లు..!

  • Notification for the recruitment of Anganwadi teacher posts!

    Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

Latest News

  • jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

  • FIFA 2026: ముగిసిన రొనాల్డో ప్రయాణం.!

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd