Wines Closed: బోనాల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్!
హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.
- Author : Balu J
Date : 14-07-2023 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
Wines Closed: బోనాల పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు కూడా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, మద్యం సర్వ్ చేసే క్లబ్బులు, పబ్బులను కూడా తెరవకూడదని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 16 ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నెల 17 సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు వైన్స్ తో పాటు మద్యం సర్వ్ చేసే అన్ని రకాల వ్యాపారాలు మూతపడనున్నాయి.
జంటనగరాల్లో ఏటా ఆషాడ మాసంలో జరిగి బోనాల పండుగ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఆదేశాలను అతిక్రమించి షాపులు తెరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా, మద్యం సేవించి గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, మహంకాళి ఆలయం పరిసరాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం.
Also Read: Green India Challenge: చెట్లు నాటడం మాత్రమే.. వాటిని కాపాడుకుంటాం కూడా: సంతోష్ కుమార్