KCR House: కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు.. కష్టాల్లో గులాబీ బాస్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచారాలకు ఎంత విలువిస్తాడో తెలిసిందే. ఒక్కోసారి ఆయన నమ్మకాలు ఆశ్చర్యపరుస్తాయి. ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా యాగాలు చేయిస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
- By Praveen Aluthuru Published Date - 02:07 PM, Tue - 16 April 24

KCR House: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచారాలకు ఎంత విలువిస్తాడో తెలిసిందే. ఒక్కోసారి ఆయన నమ్మకాలు ఆశ్చర్యపరుస్తాయి. ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా యాగాలు చేయిస్తుంటారు. అలాంటి కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం నందినగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో తాంత్రిక పూజలు జరిగినట్లు ఆనవాళ్ల ద్వారా గుర్తించిన స్థానికులు వెంటనే సెక్యూరిటిక్ సమాచారం అందించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్నసెక్యూరిటీ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మరింత సమాచారం కోసం చుట్టు ప్రక్కల సిసి పుటేజ్ తెప్పించుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు కేసీఆర్ ఇంటి పరిసరాల్లో తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరు, ఎప్పుడు చేశారన్న దానిపై విచారిస్తున్నారు. కాగా క్షుద్రపూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సినిమాటిక్ ఉన్న ఆ ఛాయలు వణుకు పుట్టించాయి.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల వేళ ఈ రకమైన చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. కాగా లోకసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందోనన్న ఆందోళన ప్రస్తుతం పార్టీలో కనిపిస్తుంది.పైగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో ఇరుక్కున్నాడన్న వార్తలు, కుమార్తె కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఈ పరిణామాలు కేసీఆర్ ని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ సమయంలో ఆయన ఇంటికి సమీపంలో తాంత్రిక్ పూజలు ఆయనను మరింత ఆందోళనకు గురు చేసే అవకాశం ఉందంటున్నారు. కేసీఆర్ మూఢనమ్మకాలను సైతం నమ్ముతారని ఆయన దగ్గరి వ్యక్తులే చెప్తుంటారు.
Also Read: Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి