TBJP: నయా నిజాం మెడలు వంచేందుకు అభినవ సర్ధార్ వస్తున్నారు.!!
మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంగా...అధికార టీఆరెస్, విపక్ష కాంగ్రెస్ తోపాటుగా బీజేపీ కూడా విజయమే లక్ష్యంగా సన్నాహాలు రచిస్తోంది.
- Author : hashtagu
Date : 20-08-2022 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక సందర్భంగా…అధికార టీఆరెస్, విపక్ష కాంగ్రెస్ తోపాటుగా బీజేపీ కూడా విజయమే లక్ష్యంగా సన్నాహాలు రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సభ జరిగింది. శనివారం టీఆరెస్ సభ జరుగుతోంది. ఆదివారం బీజేపీ సభ జరగనుంది. కాంగ్రెస్ తోపాటు ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఆదివారం అమిత్ షా సమక్షంలో మునుగోడులో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షాను ఆకాశానికి ఎత్తేస్తూ బీజేపీ తెలంగాణ శాఖ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోతోపాటు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టును కూడా షేర్ చేసింది.
నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు…కార్యకర్తలకు కర్తవ్యం గుర్తు చేసేందుకు…మునుగోడు ఉపఎన్నికలో విజయం దక్కెలా పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు మునుగోడు సమరభేరి సభకు విచ్చేస్తున్న అభినవ సర్దార్ అమిత్ షా అంటూ పోస్టులో బీజేపీ రాష్ట్ర శాఖ పేర్కొంది. అంతేకాదు నయా నిజాం మెడలు వంచేందుకే అభినవ సర్దార్ రూపంలో అమిత్ షా వస్తున్నారంటూ వీడియోలో తెలిపింది.
నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు,కార్యకర్తలకు కర్తవ్యం గుర్తు చేసేందుకు..
ఉపఎన్నికలో విజయం దక్కేలా పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు..
తెలంగాణలో బిజెపి అధికారం సాధించే దిశగా వ్యూహం రచించేందుకు మునుగోడు సమరభేరి సభకు అభినవ సర్దార్ @AmitShah
jiii🗓ఆగస్ట్ 21న
⏱మ. 3 గంటలకు
📌మునుగోడు pic.twitter.com/uiOtqgCz5V— BJP Telangana (@BJP4Telangana) August 20, 2022