BJP Telangana Candidates List : బిజెపి ఫస్ట్ లిస్ట్ లో లేని ఆ కీలక నేతలు ఎవరంటే..!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మునుగోడు టికెట్ ను ఫస్ట్ లిస్ట్ లో ఎవరికీ కేటాయించలేదు. ఇంకా ఆయన ఆసక్తి చూపిస్తున్న ఎల్బీనగర్ టికెట్ కూడా లిస్ట్ లో లేదు
- By Sudheer Published Date - 02:05 PM, Sun - 22 October 23

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిజెపి అభ్యర్థుల (BJP Telangana Candidates) తాలూకా మొదటి లిస్ట్ (BJP Candidates First List) వచ్చింది. 52 మంది తో కూడిన పేర్లను అధిష్టానం ప్రకటించింది. కాకపోతే ఆ 52 మందిలో కీలక నేతల పేర్లు లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కిషన్ రెడ్డి (Kishan Reddy), లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy), జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy), డీకే అరుణ (DK Aruna), బాబూ మోహన్ (Babu Mohan) తదితర ముఖ్య నేతల పేర్లు లేవు. దీనికి కారణం..ఏంటా అని ఆరా తీస్తున్నారు. వీరి పేర్లు రెండో లిస్ట్ లో ఉండొచ్చని అంత అనుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మునుగోడు టికెట్ ను ఫస్ట్ లిస్ట్ లో ఎవరికీ కేటాయించలేదు. ఇంకా ఆయన ఆసక్తి చూపిస్తున్న ఎల్బీనగర్ టికెట్ కూడా లిస్ట్ లో లేదు. దీంతో కోమటిరెడ్డి ఎక్కడ పోటీ చేసే అంశం ఇంకా తేల్చుకోలేకపోవడంతోనే ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు లేనట్లుగా తెలుస్తుంది. అలాగే కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు అడుగుతుండడం తో..దీనిపై ఇంకా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక కిషన్ రెడ్డి , విజయశాంతి, లక్ష్మణ్ వంటి వారు పోటీ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం తో వారి పేర్లు లిస్ట్ లో లేనట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక మొదటి లిస్ట్ లో ఉన్న వారిని చూస్తే ..
1. సిర్పూర్ : డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు
2. బెల్లంపల్లి (ఎస్సీ) : అమరాజుల శ్రీదేవి
3. ఖానాపూర్ (ఎస్టీ) : రమేష్ రాథోడ్
4 ఆదిలాబాద్ : పాయల్ శంకర్
5. బోత్ (ఎస్టీ) : సోయం బాపురావు
6. నిర్మల్ : ఆలేటి మహేశ్వర్ రెడ్డి
7. ముధోల్ : రామరావు పటేల్
8. ఆర్మూర్: పైడి రాకేష్ రెడ్డి
9. జుక్క ల్ (ఎస్సీ) : టి అరుణ తార
10. కామారెడ్డి: కె వెంకట రమణారెడ్డి
11. నిజామాబాద్ అర్బన్ : శ్రీ ధనపాల్ సూర్యనార్యగుప్త
12. బాల్కొండ: అన్నపూర్ణమ్మ ఆలేటి
13. కోరుట్ల : ధర్మపురి అర్వింద్
14. జగిత్యాల : డాక్టర్ బోగ శ్రావణి
15. ధర్మపురి (ఎస్సీ) : ఎస్ కుమార్
16. రామగుండం : కందుల సంధ్యారాణి
17. కరీంనగర్: బండి సంజయ్ కుమార్
18. చొప్పదండి (ఎస్సీ) : బొడిగ శోభ
19. సిరిసిల్ల : రాణి రుద్రమ రెడ్డి
20. మానకొండూర్ (ఎస్సీ): ఆరేపల్లి మోహన్
21. హుజూరాబాద్ : ఈటల రాజేందర్
22. నర్సా పూర్ : ఎర్రగొల్ల మురళీయాదవ్
23. పటాన్ చెరు : టి నందీశ్వర్ గౌడ్
24. దుబ్బాక : మాదవనేని రఘునందన్ రావు
25. గజ్వేల్: ఈటల రాజేందర్
26. కుత్బుల్లాపూర్: కూన శ్రీశైలం గౌడ్
27. ఇబ్రహీంపట్నం : నోముల దయానంద్ గౌడ్
28. మహేశ్వరం : అందెల శ్రీరాములు యాదవ్
29. ఖైరతాబాద్ : చింతల రామచం ద్రారెడ్డి
30. కార్వాన్ : అమర్ సింగ్
31. గోషామహల్ : టి రాజా సింగ్
32. చార్మినార్ : మేఘ రాణి
33. చాంద్రాయణగుట్ట : సత్య నారాయణ ముదిరాజ్
34. యాకుత్‌పురా : వీరేం దర్యాదవ్
35. బహదూర్‌పురా : వై. నరేష్ కుమార్
36. కల్వ కుర్తి : తల్లోజు ఆచారి
37. కొల్లాపూర్ : ఆల్లెని సుధాకర్ రావు
38. నాగార్జున సాగర్ : కంకణాల నివేదిత రెడ్డి
39. సూర్యాపేట : సంకినేని వెంకటేశ్వర్ రావు
40. భువనగిరి : గూడూరు నారాయణ రెడ్డి
41. తుం గతుర్తి (ఎస్సీ) : కడియం రాం చం ద్రయ్య
42. జనగాం : డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి
43. ఘన్‌పూర్ స్టేషన్ (ఎస్సీ) : డాక్టర్ గుండె విజయ రామారావు
44. పాలకుర్తి : లేగా రామ్మోహన్ రెడ్డి
45. డోర్నకల్ (ఎస్టీ) : భూక్య సంగీత
46. మహబూబాబాద్ (ఎస్టీ): జాథోత్ హుస్సేన్ నాయక్
47. వరంగల్ పశ్చిమ: రావు పద్మ
48. వరంగల్ తూర్పు: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
49. వర్ధన్నపేట(ఎస్సీ): కొండేటి శ్రీధర్
50. భూపాలపల్లె : చందుపట్ల కీర్తి రెడ్డి
51. యెల్లందు (ఎస్టీ): రవీంద్ర నాయక్
52. భద్రాచలం (ఎస్టీ): కుంజా ధర్మారావు
Read Also : Telangana: బీఆర్‌ఎస్ లక్ష్యం 95-100 సీట్లు: కవిత