Caste census Survey : కులగణన సర్వేకు బిజెపి సపోర్ట్ – ఎంపీ ధర్మపురి
Caste census Survey : రేవంత్ సర్కార్ మొదలుపెట్టిన కులగణనకు మద్ధతు ప్రకటించిన ఎంపీ ధర్మపురి అరవింద్.. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు
- By Sudheer Published Date - 07:31 PM, Sat - 2 November 24

రేవంత్ సర్కార్ (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే (Caste census Survey)కు బీజేపీ సపోర్ట్ ఉంటుందన్నారు బిజెపి ఎంపీ ధర్మపురి. నవంబర్ 6 నుంచి కాంగ్రెస్ సమగ్ర కుటుంబ సర్వే జరపబోతున్నారు. రాష్ట్రంలో కులాల వివరాలను సేకరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేకు పునాదులు వేస్తోంది. ఇది రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమానికి అవసరమైన సమాచారాన్ని సమకూర్చేలా చేయడం, ఆయా కులాల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం వంటి లక్ష్యాలను కలిగి ఉంది. అయితే ఈ సర్వే పై ఎంపీ ధర్మపురి (MP Dharmapuri Arvind) స్పందించారు.
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మొదలుపెట్టిన కులగణనకు మద్ధతు ప్రకటించిన ఎంపీ ధర్మపురి అరవింద్.. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టనున్న సర్వేలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తిచేయాలని, బీజేపీ సైతం ఈ సర్వేకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఇదే సందర్బంగా బిఆర్ఎస్ , కాంగ్రెస్ లపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ పార్టీ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతుందని విమర్శించిన ధర్మపురి అరవింద్.. కొత్తగా కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులేంటని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దిగదర్చారని మీకు అధికారం అప్పగిస్తే.. మీరు అంతకంటే ఘోరంగా పనిచేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిపాలన సాగుతుందని.. రానున్న రోజుల్లో ఇక్కడ హిందూ రాజ్య స్థాపన జరగాలని అన్నారు. ఇప్పటికే.. తమ కేడర్ పూర్తిస్థాయిలో పనిచేస్తుందన్న ధర్మపురి..తెలంగాణలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బీజేపీ తడాకా చూపిస్తదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ సమోదు విజయవంతంగా జరుగుతుందన్నారు.
Read Also : Rushikonda Palace : రుషికొండ నిర్మాణాలపై సీఎం ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు..?