Kompella Madhavi Latha : మాధవీలతకు షాక్ ఇచ్చిన బిజెపి..బీ ఫామ్ నిలిపివేత
తెలంగాణ లో పోటీకి సిద్దమైన పలువురు ఎంపీ అభ్యర్థులకు బిజెపి అధిష్ఠానం షాక్ ఇచ్చింది
- By Sudheer Published Date - 10:40 PM, Sat - 20 April 24

లోక్ సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కు నెల రోజుల సమయం కూడా లేదు..ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. దేశ వ్యాప్తంగా తొలి దశ పోలింగ్ కూడా పూర్తి అయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ లో పోటీకి సిద్దమైన పలువురు ఎంపీ అభ్యర్థులకు బిజెపి (BJP) అధిష్ఠానం షాక్ ఇచ్చింది. నలుగురు అభ్యర్థులకు బీ-ఫామ్‌లు (BJP B Form) పెండింగ్‌లో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, డీకే అరుణ, బూర నర్సయ్యగౌడ్ తదితరులు వివిధ నియోజకవర్గాల నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత , పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డిలకు సంబదించిన బీ ఫామ్‌ను బిజెపి అధిష్టానం నిలిపివేసింది. సడెన్ గా వీరి బీ ఫామ్‌లను ఎందుకు పెండింగ్ లో పెట్టిందో అర్ధం కావడం లేదు. వీరిని ఏమైనా తప్పిస్తుందా..? లేక రేపు ఏమైనా ఇస్తుందా..? అనేది చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత (Kompella Madhavi Latha) బీ ఫామ్ ను నిలిపివేయడం ఫై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈమె పేరును బిజెపి ప్రకటించిన దగ్గరి నుండి తనదైన శైలి లో ప్రచారం చేస్తూ దూసుకెళ్తుంది..ఇదే సమయంలో ఈమె ఫై గతంలో ఉన్న వివాదాలు బయటకు వస్తూ ఆమె ఫై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ ప్రచారం చూసిన వాళ్లంతా ఈమెకు ఓటు వెయ్యొద్దంటూ మాట్లాడుకుంటున్నారు. అంతే ఎందుకు హైదరాబాద్ లో ఈమె ప్రచారం చేస్తుండగా..ఈమెకు వ్యతిరేకంగా పలువురు మాట్లాడడం ఆమెకు సైతం షాక్ ఇచ్చింది. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీ ఫామ్ ఇవ్వలేదా.? లేక మరేమైనా కారణమా అనేది చూడాలి.
Read Also : Bone Health Foods : పాలు తాగాలంటే చిరాకా? ఈ ఫుడ్స్ కూడా ఎముకలకు బలమే..