Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
- Author : Praveen Aluthuru
Date : 13-03-2024 - 2:07 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నాడన్న వార్తలు వ్యాప్తి చెందాయి. అయితే తాజాగా అతను బీజేపీలోకి చేరడం ఖాయం కావడంతో బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. మాజీ మంత్రులు అతన్ని బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేశారు.
ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారని ప్రచారంలో భాగంగా అతన్ని బుజ్జగించేందుకు హైదరాబాదుకు తీసుకు వెళుతున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో కూర్చున్న ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి బయటకు గుంజి లాక్కెళ్లారు. ఎర్రబెల్లి దయాకర్ రావు వాహనంలో వెళ్ళొద్దంటూ నినాదాలు చేశారు. బిజెపిలో చేరాలంటూ బిజెపి కార్యకర్తలు కోరారు.దీంతో పెంబర్తి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తోపులాటలో ఆరూరి రమేష్ చొక్కా చినిగింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు అరూరిని కిషన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడించారు.
ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు #arururamesh #BJP #telangana #HashtagU pic.twitter.com/QMhzVoyQEG
— Hashtag U (@HashtaguIn) March 13, 2024
Also Read: Smita Sabharwal : తనఫై వస్తున్న ట్రోల్స్ కు సమాధానం చెప్పిన స్మితా సబర్వాల్