HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Jp Nadda Starts Political Turmoil In Telangana

JP Nadda : తెలంగాణలో ‘న‌డ్డా’ కాక‌

తెలంగాణ పొలిటిక‌ల్ సీన్ హుజారాబాద్ ఫ‌లితాల త‌రువాత అనూహ్యంగా మారిపోతోంది. నువ్వా? నేనా? అన్న‌ట్టు గులాబీ, క‌మ‌ల నాథులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇది నిజ‌మా? మైండ్ గేమా? అనే అనుమానం కూడా క‌లుగుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టు దండోరా జ‌రిగింది.

  • Author : CS Rao Date : 04-01-2022 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jp Nadda
Jp Nadda

తెలంగాణ పొలిటిక‌ల్ సీన్ హుజారాబాద్ ఫ‌లితాల త‌రువాత అనూహ్యంగా మారిపోతోంది. నువ్వా? నేనా? అన్న‌ట్టు గులాబీ, క‌మ‌ల నాథులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇది నిజ‌మా? మైండ్ గేమా? అనే అనుమానం కూడా క‌లుగుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టు దండోరా జ‌రిగింది. హుజురాబాద్ ఫలితాల త‌రువాత కాంగ్రెస్ దండోరా గ్రౌండ్ ను బీజేపీ హైజాక్ చేసింది. ఆ అవ‌కాశాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇచ్చాడ‌ని పొలిటిక‌ల్ టాక్‌.హుజారాబాద్ ఫ‌లితాల త‌రువాత వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో తాడోపేడో తేల్చుకుంటాన‌ని సీఎం కేసీఆర్ మీడియా ముందుకొచ్చాడు. మోడీ స‌ర్కార్ ను టార్గెట్ చేయ‌డంతో పాటు చైనా, భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుందో చూసుకోండంటూ..కేంద్రానికి చుర‌క‌లు వేశాడు. అంతేకాదు, ప్ర‌తి రోజూ మీడియా స‌మావేశం నిర్వ‌హించ‌డం ద్వారా నిజాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని హూంక‌రించాడు. ఇంకేముంది కేంద్రానికి, రాష్ట్రానికి మ‌ధ్య వార్ జ‌రుగుతుంద‌ని అంద‌రూ భావించారు. ఆ దిశ‌గా కేసీఆర్ అడుగులు చాలా స్పీడ్ గా ప‌డ్డాయి.

తెలంగాణ వ్యాప్తంగా కేంద్రంపై టీఆర్ఎస్ నిర‌స‌న‌ల‌కు దిగింది. ఇందిరా పార్కు వ‌ద్ద కేసీఆర్ ఒక రోజు దీక్ష‌కు దిగాడు. ఆ త‌రువాత ఛ‌లో ఢిల్లీ అంటూ హ‌స్త‌న‌లో తేల్చుకుంటామ‌ని వెళ్లాడు. ఉత్త చేతుల‌తో తిరిగి వ‌చ్చిన త‌రువాత క్షేత్ర‌స్థాయిలో రైతుల‌కు అవ‌గాహ‌న పెంచాల‌ని ఆలోచించాడు. ఆ మేర‌కు క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశాడు. పోటీగా క‌మ‌ల‌నాథులు కూడా కదం తొక్కారు.పార్లమెంట్ వేదిక‌గా ఎంపీలు వ‌రిధాన్యం కొనుగోలు గురించి నిల‌దీయాల‌ని కేసీఆర్ ఆదేశించాడు. ఆ మేర‌కు ఒక‌టి రెండు రోజులు పార్ల‌మెంట్ వేదిక‌గా పోరాట చిత్రాన్ని న‌డిపారు. అక‌స్మాత్తుగా ఆందోళ‌న విర‌మించి హైద‌రాబాదుకు వ‌చ్చేశారు. పార్ల‌మెంట్ జ‌రుగుతుండ‌గా..వాళ్లు రావ‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. దీంతో మంత్రుల‌ను ఢిల్లీ వెళ్లి తేల్చుకురాండంటూ కేసీఆర్ ఆదేశించాడు. అంద‌రూ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కెళ్లారు. ఆక‌స్మాత్తుగా క్రిస్మ‌స్ ముందు రోజు హైద‌రాబాద్ కు వాళ్లూ తిరిగి వ‌చ్చేశారు. అటు ఎంపీలు ఇటు మంత్రులు ఢిల్లీలో ఏం సాధించార‌ని ప్ర‌శ్నిస్తే..మౌనమే స‌మాధానంగా ఉంది.

వ‌రి ధాన్యం కొనుగోలు అంశంపై పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రంగా చాలా స్ప‌ష్టంగా లెక్క‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. కేంద్ర మంత్రులు మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి కేసీఆర్ స‌ర్కార్ చేస్తోన్న మ‌త‌ల‌బును వివ‌రించారు. దీంతో అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ మ‌ధ్య న‌డిచిన వ‌రి ధాన్యం కొనుగోలు వార్ స‌ద్దుమ‌ణిగింది. ఇంత‌లో 317 జీవోను ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డంపై బీజేపీ ఫైర్ అయింది. ఉద్యోగుల బ‌దిలీలు ఆ జీవో ఆధారంగా చేస్తే చాలా న‌ష్ట‌పోతార‌ని ఆందోళ‌న‌కు దిగింది. రాత్రి జాగ‌ర‌ణ‌కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ పూనుకున్నాడు. ఆయ‌న క్యాంపు ఆఫీస్ లో జ‌రిగిన ఆ జాగ‌ర‌ణను భ‌గ్నం చేయ‌డానికి పోలీసులు చేసిన ఓవ‌రాక్ష‌న్ పొలిటిక‌ల్ హీట్ ను పెంచింది. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘ‌న సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసి ఆరెస్ట్ చేశారు. కోర్టు బండికి 14 రోజుల రిమాండ్ వేసింది. దీంతో కేసీఆర్ పై బీజేపీ భ‌గ్గ‌మంటోంది.క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా జ‌రిగిన బండి జైలుకు వెళ్లిన సంఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా బీజేపీ 14 రోజుల పోరాటానికి పిలుపు ఇచ్చింది. సంఘీభావం తెల‌ప‌డానికి బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా ఢిల్లీ నుంచి వ‌చ్చాడు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులోనే ఆయ‌న్ను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. కొవ్వెత్తుల ర్యాలీకి అనుమ‌తి లేద‌ని వెన‌క్కు పంపే ప్ర‌య‌త్నం టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య జ‌రుగుతోన్న రాజ‌కీయ యుద్ధంలోని హైలెంట్ పాయింట్.

తెలంగాణ బీజేపీ అగ్ర‌నేత‌లు రాష్ట్ర పార్టీ కార్యాల‌యంలో మౌన దీక్ష‌ను చేస్తున్నారు. మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా కేంద్రాల్లోనూ నిర‌స‌న‌ల‌కు దిగారు. దీంతో ఢిల్లీ నుంచి తెలంగాణ గ‌ల్లీల వ‌ర‌కు టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య రాజ‌కీయ ప‌ర‌మైన వార్ న‌డుస్తోంది. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్ర‌శ్నార్థ‌కంగా ఉంది. ఇటీవ‌ల రెండు రోజుల పాటు పీసీసీ చీఫ్ రేవంత్ ను గృహ‌నిర్బంధం చేయ‌డం ద్వారా మీడియా వేదిక‌గా ఫోక‌స్ అయ్యాడు. ఆ ఫోక‌స్..ఇప్పుడు పూర్తిగా బండి సంజ‌య్ అరెస్ట్ వైపు మ‌ళ్లింది. మ‌రో రెండు వారాల పాటు ఇదే టెన్ష‌న్ కొన‌సాగించేలా బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. జాతీయ అధ్యక్షుడు న‌డ్డా కూడా రంగంలోకి దిగ‌డంతో ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • Bandi Sanjay arrested
  • BJP President JP Nadda

Related News

Bandi Sanjay Turns Singer

Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

ఈ గీతం యొక్క పూర్తి వెర్షన్‌ను శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రేపు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన చిన్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, దీనివల్ల నెటిజన్లలో

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    Telangana : తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది – బండి సంజయ్

Latest News

  • Ustad Bhagat Singh : ఓటీటీలోకి పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Kavitha New Party Announcement : రేపే కవిత కొత్త పార్టీ ప్రకటన

  • Pawan Kalyan Election Campaign : తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

  • IPL 2026 : SRH Vs LSG మ్యాచ్ టికెట్స్ ఓపెన్..ధర ఎంతో తెలుసా ?

  • Traffic : హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగి సగం జీవితం రోడ్లపైనే !!

Trending News

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

    • Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd