Congress Joinings: అచ్చంపేట బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో కీలక నేతలు!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతోంది.
- By Balu J Published Date - 12:05 PM, Thu - 5 October 23
Congress Joinings: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతోంది. ముఖ్య నాయకులు, నియోజకవర్గ నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతోంది. ఇప్పటికే మైనంపల్లి లాంటి నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలానికి కీలక బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అచ్ఛంపేట నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు, పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన జెడ్పీటీసీలు ప్రతాప్ రెడ్డి, మంత్రియా నాయక్, ఎంపీపీ అరుణ నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ అమరావతి సీఎం రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎం రెడ్డి, బీఆరెస్ సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, ఇతర నేతలు. జూబ్లీహిల్స్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Also Read: Singer Mangli: నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను: సింగర్ మంగ్లీ రియాక్షన్