HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big Shock For Bandla Ganesh High Courts Crucial Decision On Property Auction

Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.
Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని స్పష్టం చేస్తూ, రికవరీ చర్యలతో ముందుకు వెళ్లవచ్చని బ్యాంకుకు అనుమతినిచ్చింది. ఈ వేలాన్ని రద్దు చేస్తూ గతంలో డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది.

వివరాల్లోకి వెళ్తే.. బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా ఉన్న ‘శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ కోసం యూనియన్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ రుణాలకు పూచీకత్తుగా జూబ్లీహిల్స్‌లోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని తాకట్టు పెట్టారు. ఈ రుణాలకు సంబంధించి కుటుంబ సభ్యులు వ్యక్తిగత హామీదారులుగా ఉన్నారు.

రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో, సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద బ్యాంకు 2019లో ఆస్తిని స్వాధీనం చేసుకుని, 2022లో వేలం వేసింది. ఈ వేలంలో సదరు ఆస్తి రూ. 8.51 కోట్లకు విక్రయించబడింది. అయితే, ఈ వేలాన్ని డీఆర్‌టీ రద్దు చేయడంతో, యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ మౌషూమి భట్టాచార్య, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం, బ్యాంకు వాదనలతో ఏకీభవించింది. డీఆర్‌టీ ఉత్తర్వులను రద్దు చేస్తూ, బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ చెల్లుబాటు అవుతుందని శుక్రవారం తీర్పు వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో బ్యాంకుకు రికవరీ ప్రక్రియలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bandla ganesh
  • hyderabad
  • jubilee hills
  • Property Auction
  • Telangana High Court

Related News

Massive blast in Hyderabad's Saroornagar.

Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్ర

  • Bandla Ganesh's emotional tweet about Pawan Kalyan's health.

    Pawan Kalyan Injury: పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్

Latest News

  • TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై ‘శక్తి’ శాఖగా

  • Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

  • vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

  • Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd