Vote For Note Case : సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట
Vote For Note Case : ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది
- Author : Sudheer
Date : 20-09-2024 - 12:07 IST
Published By : Hashtagu Telugu Desk
Big Relief To CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు(Vote For Note Case) లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి భారీ ఊరట దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్ట్ (Supreme Court) ఈరోజు (శుక్రవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మహారాష్ట్రకు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని BRS MLA జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. విచారణను ప్రభావితం చేశారనడానికి ఆధారాలు, సాక్ష్యాలు లేవు కాబట్టి.. పిటిషన్‌ను ఈ దశలో ఎంటర్‌టైన్ చేయడం లేదని వెల్లడించింది.
ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవు. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. అలాగే ఈ కేసు ప్రాసిక్యూషన్‌లో సీఎం రేవంత్‌ను జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ కూడా ఈ కేసు, ప్రాసిక్యూషన్‌కి సంబంధించి ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. స్పెషల్ ప్రాసిక్యూటర్‌కి ఏసీబీ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కినట్టయింది.
2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి డబ్బులిస్తూ దొరికినట్టుగా అప్పట్లో ఏసీబీ ప్రకటించింది. కానీ ఈ ఆరోపణలను రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంత కాలం జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని జగదీశ్ వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు అంగీకరించలేదు.
Read Also : Tirumala Laddu Controversy : హైకోర్టుకు వైసీపీ