Bhumi Pooja : రేపు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ..
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించినట్లుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది
- By Sudheer Published Date - 11:02 PM, Tue - 27 August 24

రేపు బుధువారం ఉదయం 11 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం (secretariat) ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ(telangana mother statue)కు భూమిపూజ (bhumi pooja ) నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ 9న ఆవిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించినట్లుగానే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
వారం రోజుల క్రితం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితోపాటు సచివాలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలాన్ని పరిశీలించారు. విగ్రహం చుట్టూ ఉండాల్సిన డిజైన్ పై కూడా అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర అధికార కేంద్రమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడే తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని సీఎం స్పష్టం చేశారు. చెప్పినట్లే సెక్రటేరియట్ ప్రాంగణంలో రేపు విగ్రహ ఏర్పాటుకు భూమి పూజా చేయబోతున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుంది.
Read Also : Malavika Mohanan : ప్రభాస్ గురించి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!