Malavika Mohanan : ప్రభాస్ గురించి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఈ సినిమాలో ప్రభాస్ తో జత కట్టిన మాళవిక రెబల్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. కల్కి లాంటి హిట్ వచ్చినా కూడా ప్రభాస్ చాలా
- By Ramesh Published Date - 10:27 PM, Tue - 27 August 24

రెబల్ స్టార్ ప్రభాస్ తో పరిచయం ఉంటే చాలు ఆ హీరోయిన్స్ కి ప్రభాస్ ఎంత మంచి వాడన్నది తెలుస్తుంది. అంతేకాదు ప్రభాస్ పెట్టే ఇంటి భోజనం గురించి ఆయనతో నటించిన హీరోయిన్స్ అంతా కూడా స్పెషల్ గా చెప్పుకుంటారు. ఐతే ఈ లిస్ట్ లో మరో అందాల భామ కూడా చేరిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా ఆమె మాళవిక మోహనన్. ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.
మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. ఈమధ్యనే ప్రభాస్ గ్లింప్స్ వదిలి ఫ్యాన్స్ ని అలరించిన మారుతి త్వరలో సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో జత కట్టిన మాళవిక రెబల్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. కల్కి లాంటి హిట్ వచ్చినా కూడా ప్రభాస్ చాలా సైలెంట్ గా ఉన్నాడని ఆమె అన్నది.
కల్కి ముందు రాజా సాబ్ (Raja Saab) షూటింగ్ లో పాల్గొన్న మాళవిక అప్పుడు ప్రభాస్ (Prabhas) ఎలా ఉన్నాడో కల్కి హిట్ అయ్యాక కూడా అలానే ఉన్నారని. హిట్ వచ్చింది అన్న ఏ మాత్రం మార్పు ఆయనలో లేదని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్ గురించి మాళవిక చేసిన కామెంట్స్ డార్లింగ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
మలయాళం, తమిళంలో ఇప్పటికే మాళవిక (Malavika) సినిమాలు చేస్తుండగా తెలుగులో రాజా సాబ్ తోనే ఎంట్రీ ఇస్తుంది. తప్పకుండా అమ్మడికి రాజా సాబ్ గ్రాండ్ ఎంట్రీ అవుతుందని చెప్పొచ్చు. ప్రభాస్ రాజా సాబ్ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు.
Also Read : Megastar Chiranjeevi Viswambhara : విశ్వంభర బిజినెస్ కు భారీ డిమాండ్..!