HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bhatti Vikramarka Key Roll In Candidates Selections

Telangana Congress : టీ కాంగ్రెస్‌లో అభ్య‌ర్థుల ఎంపిక‌.. ఆ లీడ‌ర్‌దే “కీ” రోల్‌..!

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. ఇందుకోసం ఉన్న అవ‌కాశాల‌న్నీంటిని

  • Author : Prasad Date : 06-07-2023 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Congress
Telangana Congress

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. ఇందుకోసం ఉన్న అవ‌కాశాల‌న్నీంటిని అందిపుంచుకుంటుంది. బీఆర్ఎస్‌లో కీల‌క నేత‌లుగా ఉన్న పొంగులేటి, జూప‌ల్లిని చేర్చుకుంది. పార్టీ గెలుపుకు ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డంలేదు. ఇటు తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఊపిరినిచ్చింది. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించిన‌ట్లు స‌మాచారం. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన సుధీర్ఘంగా చర్చించారు.

రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్ విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CLP leader Bhatti Vikramarka
  • congress
  • rahul gandhi
  • telangana
  • tpcc
  • tpcc chief revanth

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

  • Aiadmk Eyes Tvk Alliance

    Vijay TVK: విజయ్‎తో టచ్‎లో 10 మంది ఎమ్మెల్యేలు..!

  • Support from Congress for TVK Vijay

    TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!

  • West Bengal Congress

    West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

Latest News

  • Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

  • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd