Bhatti Vikramarka : హోంమంత్రిగా భట్టి విక్రమార్క?
Bhatti Vikramarka : ఆయనకు హోంశాఖ (Home Minister) అప్పగించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ సహా పలు కీలక శాఖలు ఉన్నాయి
- Author : Sudheer
Date : 09-06-2025 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt)లో శాఖల కేటాయింపుపై కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు ప్రస్తుతం ఆర్థిక మరియు ఇంధన శాఖలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆయనకు హోంశాఖ (Home Minister) అప్పగించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ సహా పలు కీలక శాఖలు ఉన్నాయి. రేవంత్ ఢిల్లీ పర్యటన అనంతరం ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
తాజాగా మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురు నేతలు రాజకీయంగా గణనీయమైన అనుభవం కలిగి ఉండటంతో, మంత్రివర్గానికి మరింత బలం చేకూరుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇక కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే బాధ్యతలు అప్పగించే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్య, మున్సిపల్, సంక్షేమ శాఖలు ప్రస్తుతం రేవంత్ వద్ద ఉన్న కారణంగా, వీటిలో కొన్ని కొత్త మంత్రులకు కేటాయించే అవకాశముంది. భట్టి విక్రమార్కకు హోంశాఖ అప్పగింపుతో పాటు, మిగిలిన మంత్రులకు కూడా శాఖల కేటాయింపు త్వరలోనే స్పష్టత రానుంది.