HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bhatti Vikramarka And Sitakka As Deputy Cms

T Congress : డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్క..?

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంలుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్కలను నిర్ణయించినట్లు తెలుస్తుంది

  • Author : Sudheer Date : 04-12-2023 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhatti Sithakka
Bhatti Sithakka

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ (Congress) పార్టీ..మరికాసేపట్లో సీఎం (CM) ఎవరో ప్రకటించనుంది. హైదరాబాద్ లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సీఎం అభ్యర్థి పేరును కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు.

కాంగ్రెస్ నుండి గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు మీట్ అయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎంలుగా మల్లు భట్టి విక్రమార్క, సీతక్క (Bhatti Vikramarka Sitakka )లను నిర్ణయించినట్లు తెలుస్తుంది. వీరి పేర్లనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. రాత్రి 8.30 గంటలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైంది. ఎస్సీ వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, ఎస్టీ నుంచి సీతక్క డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం అందుతుంది. ఇందుకోసం దర్బార్ హాల్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

We’re now on WhatsApp. Click to Join.

డిప్యూటీ సీఎంగా సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ సహా మరికొన్ని బాధ్యతలు దక్కనున్నాయి. మల్లు భట్టి విక్రమార్కకు ఫైనాన్స్, పౌర సరఫరాల శాఖలు కేటాయించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నా ప్రమాణ స్వీకారం తర్వాత పోర్టుఫోలియోలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనున్నది. మైనారిటీ కమ్యూనిటీ నుంచి షబ్బీర్ ఆలీకి అవకాశాలుండొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన కేబినెట్ మంత్రులను ఖరారు చేయడంపై నాలుగైదు రోజుల్లో కసరత్తు పూర్తి కానున్నదని సమాచారం.

Read Also : Telangana: బీఆర్ఎస్ ఓటమి ఎఫెక్ట్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka mallu
  • congress
  • revanth
  • Seethakka
  • telangana CM
  • Telangana Deputy CM

Related News

    Latest News

    • Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

    • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

    • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

    • Giorgia Meloni: ట్రంప్ పై మెలోని ఫైర్

    • Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd