HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bhatti Peoples March Padayatra Ending Meeting In Khammam

Congress : ఖ‌మ్మంలో “జ‌న‌గ‌ర్జ‌న‌”.. భ‌ట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు స‌భ వేదిక నుంచే.. ?

తెలంగాణ కాంగ్రెస్‌కి పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర పున‌ర్జీవం అయింది.ఉద్యమాన్ని తలపించేలా పీపుల్స్ మార్చ్ సాగించి సీఎల్పీ

  • Author : Prasad Date : 29-06-2023 - 5:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress Hashtag
Congress Hashtag

తెలంగాణ కాంగ్రెస్‌కి పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర పున‌ర్జీవం అయింది.ఉద్యమాన్ని తలపించేలా పీపుల్స్ మార్చ్ సాగించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచిపోనుంది. భట్టి పాదయాత్ర వలన పార్టీలో సైలెంట్ సునామీగా మారింది. ఆయ‌న పాద‌యాత్ర టీకాంగ్రెస్ కేడర్ లో జోష్ పెంచింది. ఎన్నికల వేళ సమరానానికి సైన్యంలో పోరాట కసిని పెంచింది. దీనిని గుర్తించిన హైకమాండ్ భట్టికి అరుదైన గౌరవం అందిస్తోంది. ఖమ్మం గడ్డపైన లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో భట్టిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ తరపున సత్కరించనున్నారు. ఇదే సభలో ముఖ్య నేతల చేరికలు, తెలంగాణ భవిష్యత్ పై భరోసా ఇస్తూ ఎన్నికల సమరశంఖం పూరించేందుకు ఖమ్మం “జనగర్జన” వేదికగా నిలవనుంది.

ఒక్క తెలంగాణలోనే కాదు, కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తున్న పేరు మల్లు భట్టి విక్రమార్క. దక్షిణాదిని కర్ణాటక తరువాత కాంగ్రెస్ నాయకత్వం ఫోకస్ చేసిన రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్ కు అధికారం దక్కాలి.. రాహుల్ ప్రధాని కావాలి. ఈ రెండు అంశాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై ప్రజల మధ్య నుంచే భట్టి నిలదీసి.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనారోగ్య సమస్యలు తలెత్తినా వెనుకడుగు వేయలేదు. ఈ యాత్రతో నేతలందరు ఏకం అయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా యాత్ర‌కు తరలి వచ్చారు. అగ్ర నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రజలు మద్దతుగా నిలిచారు. అందుకే ఇప్పుడు భట్టి పీపుల్స్ మార్చ్ కు ఇంత పాపులారిటీ వచ్చింది.

భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ లో వచ్చిన మార్పును హైకమాండ్ గుర్తించింది. దీంతో భట్టి యాత్రకు సరైన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో పార్టీలో ముఖ్యుల చేరికల పైన భట్టి చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. అన్నింటికీ సరైన వేదిక ఖమ్మంగా నిర్ణయించారు. ఇక్కడ నుంచే పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పైన తమకున్న అభిమానం చాటుతూ..భవిష్యత్ లో ఏ విధంగా తెలంగాణ కోసం ఎటువంటి నిర్ణయాలు అమలు చేసేది ప్రకటించనున్నారు. ఇక్కడ నుంచే బీఆర్ఎస్ ప్రభుత్వం పై గర్జనకు సిద్ధమయ్యారు. ఈ సభకు జనగర్జనగా పేరు ఖరారు చేసారు.

సీఎల్పీ నేత భట్టితో తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే సమావేశమయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పైన చర్చించారు. పార్టీలో చేరనున్న మాజీ ఎంపీ పొంగులేటిని సమావేశానికి ఆహ్వానించారు. ఖమ్మం సభ వంద ఎకరాల్లో నిర్వహించేలా కసరత్తు ప్రారంభించారు. భట్టి చారిత్రాత్మక యాత్ర ముగింపు సభగా.. పొంగులేటి చేరిక వేదికగా ఈ సభను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్ అధికారం లోకి వస్తూనే దగా పడిన తెలంగాణ ప్రజల కోసం ఏం చేయనుందో స్పష్టత ఇవ్వనున్నారు. ఖమ్మం సభకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభంజనం ఖమ్మం నుంచే మొదలు కానుంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌పై ఫోక‌స్ పెట్టింది. దీంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఖమ్మం జనగర్జన సభ వైపే చూస్తోంది. ఈ సభ కోసం ఏర్పాట్లు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • congress
  • khammam
  • peoples march
  • rahul gandhi
  • tpcc

Related News

CM Revanth Reddy issues a strong warning to KTR.

Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఖమ్మం జిల్లాలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ (రైతు ఆశీర్వాద సభ) వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లక్ష్యంగా అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని సందర్శించి, మేడిగడ్డ బ్యారేజీలో తక్షణమే నీటిని నింపాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ లోపాలతో ఇ

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd