CM Revanth : సీఎం భద్రాచలం పర్యటనలో అపశృతి.. ఏఎస్పీ కి గాయాలు..
- By Sudheer Published Date - 08:28 PM, Mon - 11 March 24

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) భద్రాచలం పర్యటన (Bhadrachalam Tour)లో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ (CM Convoy
) ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్ (ASP Paritosh Pankaj)కు గాయాలయ్యాయి. సీఎం రేవంత్ ఈరోజు సోమవారం బిజీ బిజీ గా గడిపారు. ఉదయం యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. కాగా సీఎం భద్రాచలం పర్యటనలో చిన్న పాటి అపశృతి వాటిల్లింది. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్‌కు గాయాలయ్యాయి. దీంతో అధికారులు అతనిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉంది.
ఈ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్..మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి దళితులను ఆదుకున్నా అని చెబుతున్నావ్ కదా KCR. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చావో అక్కడ నువ్వు ఓట్లు వేయించుకోవాలి. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాలు కు KCR సిద్ధమా?’ అని రేవంత్ ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు మోసం చేసిందని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పాలనలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రధాని చెప్పారన్న ఆయన, ఆ పథకం ద్వారా తెలంగాణలో ఎక్కడ ఇళ్లు కట్టారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై తుపాకీలు ఎక్కుపెడుతున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని, భర్తీలే కానీ పూరించివుంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండదు కదా అని ప్రశ్నించారు.
Read Also : Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన టీపీసీసీ