HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Beware Of Adulterated Mangoes Cp Sajjanar

CP Sajjanar: కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త: సీపీ సజ్జనార్

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 2:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CP Sajjanar Warning on Chemically Ripened Mangoes
CP Sajjanar Warning on Chemically Ripened Mangoes

Mango Adulteration  వేసవి వచ్చిందంటే చాలు, పండ్లలో రారాజైన మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మార్కెట్లో కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు.

కొందరు స్వార్థపరులైన వ్యాపారులు, కేవలం కాసుల కక్కుర్తితో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సహజ సిద్ధంగా కాకుండా, కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. రోడ్డు పక్కన నిగనిగలాడుతూ, ఒకే రకమైన పసుపు పచ్చ రంగులో ఆకర్షణీయంగా కనిపించే పండ్లను చూసి మోసపోవద్దని సూచించారు.

సహజంగా పండిన పండు అన్నిచోట్లా ఒకే రంగులో ఉండదని, కానీ రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండు పైన పసుపుగా ఉన్నా లోపల పచ్చిగా, రుచిహీనంగా ఉంటుందని వివరించారు. ఇలాంటి కల్తీ పండ్లను తినడం ప్రాణాంతకం కాగలదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. వీటిని తినడం వల్ల తక్షణమే గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తవచ్చని వివరించారు.

ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి కల్తీ వ్యాపారాలపై హైదరాబాద్ పోలీస్ విభాగం ఉక్కుపాదం మోపుతోందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్‌-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందాలు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండ్ల రూపాన్ని చూసి కాకుండా, సహజత్వాన్ని గమనించి కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసాధారణ రంగు, రసాయన వాసన, వింత రుచి ఉన్న పండ్లకు దూరంగా ఉండాలన్నారు.

ఎక్కడైనా కల్తీ మామిడి పండ్లను విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు గానీ, హెచ్-ఫాస్ట్ వాట్సాప్ నంబర్‌ 8712661212కు గానీ ఫిర్యాదు చేయాలని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • artificial colours
  • Calcium Carbide
  • hyderabad police
  • Hyderabad Police Commissioner
  • mangoes
  • VC Sajjanar hyderad police commisnar

Related News

    Latest News

    • Tamil Nadu Protest: తమిళనాడు గవర్నర్ పై కాంగ్రెస్ ఆగ్రహం

    • Vishal: గవర్నర్ తీరును తప్పుబట్టిన హీరో విశాల్!

    • Petrol Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయం..!

    • Pithapuram వర్మపై టీడీపీ వేటు

    • TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd