HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bathukamma Celebrations Will Begin From The 21st Of This Month Which Day Is Bathukamma

Bathukamma: ఈనెల 21 నుంచి బతుకమ్మ సంబరాలు.. ఏ రోజు ఏ బతుకమ్మ?

ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.

  • By Gopichand Published Date - 07:23 PM, Fri - 5 September 25
  • daily-hunt
Bathukamma
Bathukamma

Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ (Bathukamma) పండుగ సంబరాలు ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండుగ కోసం తెలంగాణ ఆడపడుచులు ఇప్పటికే సన్నద్ధమవుతున్నారు. ప్రతిరోజు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ గౌరమ్మను కొలుస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మతో సంబురాలకు ముగింపు పలుకుతారు.

తొమ్మిది రోజుల బతుకమ్మల వివరాలు

ఈ తొమ్మిది రోజులు బతుకమ్మకు ఒక్కో పేరు ఉంటుంది. రోజువారీ బతుకమ్మల వివరాలు ఇలా ఉన్నాయి.

  • సెప్టెంబర్ 21 – ఎంగిలి పూల బతుకమ్మ: మొదటి రోజు బతుకమ్మను ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో బతుకమ్మను పేర్చి, పప్పు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు.
  • సెప్టెంబర్ 22 – అటుకుల బతుకమ్మ: రెండో రోజు గునుగు పూల గుత్తులతో బతుకమ్మను పేర్చి, అటుకులు, బెల్లం కలిపి నైవేద్యం సమర్పిస్తారు.
  • సెప్టెంబర్ 23 – ముద్దపప్పు బతుకమ్మ: ఈ రోజు బతుకమ్మను ముద్దపప్పు, బెల్లంతో తయారు చేసిన పిండి వంటలతో కొలుస్తారు.
  • సెప్టెంబర్ 24 – నానే బియ్యం బతుకమ్మ: నాలుగో రోజు బతుకమ్మకు నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడతారు.

Also Read: Urea : రైతులకు గుడ్ న్యూస్..రేపు తెలంగాణకు 9,039 మెట్రిక్ టన్నుల యూరియా

  • సెప్టెంబర్ 25 – అట్ల బతుకమ్మ: ఐదో రోజు అట్లు, దోసెలు తయారు చేసి బతుకమ్మకు నైవేద్యం పెడతారు.
  • సెప్టెంబర్ 26 – అలిగిన బతుకమ్మ: ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మను పేర్చకుండా, కేవలం పూలతో గౌరమ్మను మాత్రమే పూజిస్తారు.
  • సెప్టెంబర్ 27 – వేపకాయల బతుకమ్మ: ఏడో రోజు వేపకాయలలాగా కనిపించే పూలతో బతుకమ్మను పేర్చి, వేపకాయలలా ఉండే పిండి వంటకాలను నైవేద్యంగా పెడతారు.
  • సెప్టెంబర్ 28 – వెన్న ముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వెన్న, నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ముద్దలను నైవేద్యంగా పెడతారు.
  • సెప్టెంబర్ 29 – సద్దుల బతుకమ్మ: బతుకమ్మ పండుగలో అత్యంత ముఖ్యమైన రోజు ఇది. వివిధ రకాల పూలతో పెద్ద బతుకమ్మను పేర్చి, సాయంత్రం ఆటపాటలతో సందడిగా జరుపుకుంటారు. చివరిగా వివిధ రకాల సద్దులు (అన్నం) తయారు చేసి, బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, ఆడపడుచుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ తొమ్మిది రోజులు తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభతో కళకళలాడతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathukamma
  • Bathukamma Celebrations
  • dasara
  • devotional
  • festivals
  • Telugu Festivals

Related News

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir : అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్.. దర్శన వేళల్లో మార్పులు,

దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శీతాకాలం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ దర్శన సమయ వ్యవధిని గంట మేర తగ్గించినట్లు ట్రస్ట్

  • Diwali

    Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

  • Diwali

    Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

  • Diwali

    Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • TTD

    TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

Latest News

  • Rice Bran Oil: గుండె స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే.. ఈ నూనె వాడాల్సిందే!

  • Virginity: వర్జినిటీ కోల్పోవ‌డానికి స‌రైన వ‌య‌స్సు ఉందా?

  • Vitamin D: విటమిన్ డి గ్రహించడాన్ని అడ్డుకునే ఆహారాలు ఇవే?!

  • Relationship Tips: మీ భాగ‌స్వామిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అయితే దూరం అవుతున్న‌ట్లే!

  • AUS Beat IND: అడిలైడ్‌ వన్డేలో భారత్ ఘోర ఓట‌మి.. సిరీస్ ఆసీస్ కైవ‌సం!

Trending News

    • 8th Pay Commission: ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం!

    • YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

    • HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్

    • ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇక‌పై రూ. 23 క‌ట్టాల్సిందే!

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd