Bandla Ganesh: సీపీఐ, సీపీఎం పార్టీల్లో కూడా చేరి బ్యాలెన్స్ చేయండక్కా … జీవితా రాజశేఖర్‌పై బండ్ల గణేష్ ఫైర్..!
టాలీవుడ్‌లో జీవితా రాజశేఖర్ దంపతులకు రాజకీయాలపై మోజు ఎక్కువే. కానీ వారు ఏ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు.
- Author : Hashtag U
Date : 26-08-2022 - 2:26 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్‌లో జీవితా రాజశేఖర్ దంపతులకు రాజకీయాలపై మోజు ఎక్కువే. కానీ వారు ఏ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు. క్రియాశీలకంగా ఉండరు. అన్ని పార్టీలు చుట్టేస్తూ ఉంటారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే సమయంలో మాత్రం తీవ్ర విమర్శలు చేసి వెళ్లిపోతుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవితా రాజశేఖర్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మరణం తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. అయితే జగన్ తనకు తగిన విలువ ఇవ్వలేదంటూ తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత వారు టీడీపీలో చేరారు. అక్కడ కూడా వారు ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు. ఇటీవల కాలంలో జీవితా రాజశేఖర్ దంపతులు బీజేపీలో చేరారు. కాగా తాజాగా టీఆర్ఎస్ పార్టీ, కవిత, కేటీఆర్‌పై జీవిత రాజశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Balance Political parties CPI CPM & MIM ONLY After this one round complete akka 😀 https://t.co/feRHGvh0Jx
— BANDLA GANESH. (@ganeshbandla) August 25, 2022
తెలంగాణ కోసం ఉద్యమం నడుపుతున్న సమయంలో కేసీఆర్ కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి.. అని ఆమె ప్రశ్నించారు. పరిపాలన ధర్మంగా చేస్తే వేల కోట్లు సంపాదించడం సాధ్యమవుతుందా.. అంటూ కేసీఆర్ కుటుంబంపై జీవిత విమర్శలు చేశారు. హైదరాబాద్‌లోని పలు పబ్బుల్లో కేటీఆర్‌కు వాటాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేశారు. కాగా, జీవితా రాజశేఖర్ చేసిన ఆరోపణలకు నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశాడు. అన్ని పార్టీలు తిరిగిన ఆదర్శ దంపతులు జీవితా రాజశేఖర్.. అంటూ విమర్శలు గుప్పించాడు. ఎన్ని పార్టీల జెండాలు ఉన్నాయో.. అన్ని పార్టీల జెండాలు మెడలో వేసుకున్న ఆదర్శ దంపతులు అంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యాడు. లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశాడు.
‘అన్ని పార్టీల్లో తిరిగారు. ఇక సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీల్లో కూడా చేరి బ్యాలెన్స్ చేయండి అక్క’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. కాగా గత ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్య జనసేనకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. నిత్యం పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన జీవితా రాజశేఖర్‌పై బండ్ల గణేష్ ఫైర్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.