HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Writes Open Letter To Cm Kcr On Farmers

Bandi Letter To KCR: రైతుల కష్టాలపై సీఎం కేసీఆర్ కు …బండి సంజయ్ లేఖ.!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.

  • Author : Hashtag U Date : 22-04-2022 - 10:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana BJP
Sanjay bandi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రక్షణ, రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ఈ లేఖను రాశారు. రైతుల సంక్షేమం కోసం సర్కార్ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 14లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందన్నారు. రైతుల డిమాండ్ల కోసం…రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోసం నిరసనలు చేస్తున్నామని ఆయన తన లేఖలో వివరించారు. ప్రస్తుతం తాను కొనసాగిస్తున్న పాదయాత్రలో చాలా మంది కౌలు రైతులు తనను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

బహిరంగ లేఖలో ఏం రాసారంటే…
ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడుత పాదయాత్రలో భాగంగా చాలా మంది రైతులు తనను కలిశారనీ..గత వారం రోజులుగా ఏ గ్రామానికి వెళ్లినా వందలాది మంది రైతులు తమ దగ్గరకు వచ్చి రైతు రుణమాఫీ జరగలేదని తమ గోడును చెప్పుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా ఎంతో మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్లు రాశారు. రాష్ట్రంలోని దాదాపు 14లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి రక్షణ లేదన్నారు. దీంతో ఆయా వర్గాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని తెలిపారు. సర్కార్ నుంచి రైతులకు అందే ప్రయోజనాల్లో కౌలు రైతుకలకు ఎలాంటి లబ్ది చేకూరలేకపోవడం విచారకరమన్నారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని సంజయ్ డిమాండ్ చేశారు.

కాగా 2018 ఎన్నికల వేళ TRSలక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తుందన్న హామీ ఇచ్చింది. కానీ ఈ నాలుగేండ్లలో సర్కార్ రూ. 20,164.20కోట్లు కేటాయించినట్లు భజన చేస్తుందని విమర్శించారు. మొత్తం కేటాయింపుల్లో కేవలం 1.144.38కోట్లు మాత్రమే రిలీజ్ చేసిందని పేర్కొన్నారు. దీంతో 5.66లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగగా దాదాపు 31లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. 25వేల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 2.96లక్షల మంది ఉండగా…వారికి రుణమాఫీ కావాల్సింది 408.30కోట్లని రాశారు. 25వేల రూపాయల నుంచి 50వేల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సిన రైతులు 5.72 లక్షల మంది ఉండగా…వారి రుణాలు 1,7900కోట్ల రూపాయాలని లేఖలోపేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు రైతుల ఖాతాల్లో పడితే వాటిని కింద బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని ఈ సందర్భంగా బండి సంజయ్ లేఖలోతెలిపారు. పెండింగ్ లోఉన్న రైతు రుణమాఫీ బాకాయిలును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • kcr
  • telangana CM

Related News

    Latest News

    • జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

    • యుద్దం వేళ వంటగ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ఆదేశాలు..

    • మందుబాబులకు ఓ శుభవార్త.!

    • Gas Cylinder : మీ వంట గ్యాస్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి ..చాలు !!

    • ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. 13 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన

    Trending News

      • 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

      • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

      • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

      • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd