Telangana Polls : బీసీ నేత సీఎం కావాలంటే బిజెపికి ఓటు వేయాలి – బండి సంజయ్
ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ అని బండి సంజయ్ అన్నారు
- By Sudheer Published Date - 07:49 PM, Fri - 10 November 23
తెలంగాణ (Telangana) లో నామినేషన్ల పర్వం ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ల(Nominations)ను పూర్తి చేసి..ఇక ప్రచారాన్ని మరింత స్పీడ్ చేయాలనీ చూస్తున్నారు. గల్లీ నేతల దగ్గరి నుండి జాతీయ నేతల వరకు అంత ప్రచారంలో బిజీ బిజీ గా తిరుగుతున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న బిజెపి (BJP) సైతం ప్రచారాన్ని స్పీడ్ చేసింది. రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ (Modi) హైదరాబాద్ సభలో పాల్గొని నేతల్లో , కార్యకర్తల్లో ఉత్సాహం నింపగా..ప్రస్తుతం నేతలంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
శుక్రవారం రాజన్న సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమదేవికి మద్దతుగా పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండి సంజమ్ (Bandi Sanjay) పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీ నేత సీఎం కావాలంటే బిజెపి అధికారంలోకి రావాల్సిందే అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచినా.. కాంగ్రెస్ గెలిచినా ఉప ఎన్నికలు గ్యారంటీ అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ సుస్థిర పాలన ఏర్పాటు చేసే వరకు ఆగదని.. ప్రజల గుండెల్లో బీజేపీ పువ్వు వికసించి ఉందన్నారు. కేటీఆర్ షాడో సీఎం.. ఆయన కింద ప్రతి మండలానికి ముగ్గురు సామంత రాజులు ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 50 లక్షల నిరుద్యోగుల కోసం నేను కొట్లాడా.. టెన్త్ పేపర్ లీకేజ్ పేరిట జైలుకు పంపారని బండి సంజయ్ మండిపడ్డారు. పెన్షన్ దారులకు, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తే బీఆర్ఎస్‌కు ఓటెయ్యండని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
Read Also : Karnataka BJP New Chief : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని మార్చేసిన అధిష్టానం