Karnataka BJP New Chief : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిని మార్చేసిన అధిష్టానం
ప్రస్తుతం నళిన్ కుమార్ కటీల్ అధ్యక్షా పదవి కొనసాగిస్తుండగా..ఆ స్థానంలో విజయేంద్ర యడ్యూరప్పను అధిష్టానం నియమించింది
- By Sudheer Published Date - 07:30 PM, Fri - 10 November 23

బిజెపి (BJP) అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక (Karnataka ) లో పార్టీ అధ్యక్షుడిని మార్చేసింది. ప్రస్తుతం నళిన్ కుమార్ కటీల్ అధ్యక్షా పదవి కొనసాగిస్తుండగా..ఆ స్థానంలో విజయేంద్ర యడ్యూరప్ప (Vijayendra Yediyurappa)ను అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కొడుకే విజయేంద్ర యడ్యూరప్ప.
ఇక, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి పాలయ్యింది. దీంతో బీజేపీ అధిష్టానం మరికొన్ని నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షడిని మార్చేసింది.
కొద్దీ నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలోనూ అలాగే చేసారు. బండి సంజయ్ ని తప్పించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్ ని తప్పించడం చాలామందికి నచ్చలేదు. ఆ ఎఫెక్ట్ పార్టీ ఫై భారీగా పడింది. బండి సంజయ్ అధ్యక్షా పదవిలో ఉండగా..రాష్ట్రంలో కమలం హావ గట్టిగా ఉండే..ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ అయ్యింది. మరి కర్ణాటక లో ఏంజరుగుతుందో చూడాలి. ప్రస్తుతం బిజెపి పార్టీ ఫోకస్ అంత తెలంగాణ ఎన్నికల పైనే పెట్టింది. తెలంగాణ లో కమలం జెండా ఎగురవేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది డిసెంబర్ 03 న తెలుస్తుంది.
Read Also : Hyd Police : బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై బాణసంచా పేలిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు