HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bandi Sanjay Claims Bjp Can Over Throw Trs In Next Polls

Bandi Sanjay: ‘తెలంగాణ’లోనూ రాబోయేది ‘బీజేపీ’ ప్రభుత్వమే – ‘బండి సంజయ్’

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

  • Author : Hashtag U Date : 10-03-2022 - 8:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Imresizer
Bandi Imresizer

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, ఐదు రాష్రాల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్ కుమార్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ అధ్యక్షులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, యువ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, గీతామూర్తి, రాష్ట్ర నాయకులు సీహెచ్.విఠల్, గూడూరు నారాయణరెడ్డి, జె.సంగప్ప, ఆకుల విజయ, డాక్టర్ పద్మ ఉమారాణి, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….. 5 రాష్ట్రాల్లో ఓట్లేసిన ప్రజలకు, 4 రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించిన వారందరికీ పార్టీ రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదాలు. నరేంద్రమోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లకు ప్రత్యేక క్రుతజ్ఝతలు. ఫలితాలు చూసిన తరువాత కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఉత్సవాలు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు, తరువాత కూడా చాలా సర్వే సంస్థలు, ప్రత్యర్ధి పార్టీలు బీజేపీ పనైపోయిందని చేసిన ప్రచారం తలకిందులైంది. 37 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ఘనత యోగీ సర్కార్ దే. గూండారాజ్, మాఫియా రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఘనత యోగిదే అని బండి సంజయ్ అన్నారు. దేశవ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు మరోసారి నిరూపించారు. అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు ఆశిస్తున్నారు. తెలంగాణలో కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారు.

కేంద్ర సంక్షేమ పథకాలను నీరు గారుస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించడం లేదు. రాష్ట్ర వాటాను ఖర్చు చేయడం లేదని కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ మండిపడ్డారు.
సిగ్గుతో తలదించుకోవాల్సిన కేసీఆర్ ఫ్రభుత్వం మళ్లీ కేంద్రంపైనే దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బూచితో రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని వెల్లడించారు. 2014 నుండి తెలంగాణలో బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. గత ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇక్కడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఇంజన్ దారుస్సలాంకు తాకట్టు పెట్టారు. ఇంజన్ లేని సర్కార్ ముందుకు సాగదు. 4 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాల స్పూర్తితో తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకుటాం. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇక విలేకరులు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు.

చెల్లని రూపాయికి గీతలెక్కువ. కేసీఆర్ కు కోతలెక్కువ. దేశం మొత్తం తిరిగి టెంట్, ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్… 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు? ఆయనను ఎవరూ ఎందుకు పిలవలేదు? కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం పోయింది. లీడర్లకు ఆయన సంగతి బాగా తెలుసు. అందుకే ఎవరూ పిలవడం లేదని బండి సంజయ్ అన్నారు.
కేసీఆర్ అవినీతి-నియంత-కుటుంబ పాలన పట్ల తెలంగాణ జనం విసిగిపోయారు. సరైన సమయంలో వాత పెట్టబోతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటన విహార యాత్రలుగానే మిగిలిపోతాయి. టైం పాస్ యాత్రలే తప్ప ఆయనను రమ్మన పిలిచిన నాయకులు ఒక్కరూ లేరు.

నిరుద్యోగ సమస్యపై బీజేపీ చేసిన ఉద్యమాల సెగ తాకడంతోనే సీఎం భయపడి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ ఇతరుల పేరుతో కోర్టులో కేసులు వేయించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగిపోయేలా చేసి జాప్యం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే… ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లబోమని హామీ ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్… ఓ డ్రామా రావు. ఆయన మాటలు పట్టించుకునేదెవరు?కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం. అతి త్వరలో మీరే చూడబోతున్నారు. మాకంటే ప్రజలకు, మీకే (మీడియా) కేసీఆర్ లాంటి అవినీతి పరుడిని జైల్లో వేయాలని ఉత్సాహపడుతున్నారు. సరైన సమయంలో జైలుకు పోవడం ఖాయమని చెప్పారు. ఇక పార్టీలోకి ఎవరో వస్తారని మేం ఎదురు చూడం. పార్టీ సిద్ధాంతాలు, నరేంద్రమోదీ నాయకత్వాన్ని సమర్ధించే వాళ్లను మాత్రమే పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తాం.
తెలంగాణపై జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా రాష్ర్టానికి వస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP state president
  • Sanjay Bandi
  • Telangana BJP
  • telangana elections
  • trs

Related News

Balka Suman

BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమ‌న్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన‌ వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సమర్పించిన వీడియో ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేప

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd