CM Revanth Reddy : సీఎం రేవంత్ పేరును మరచిపోయిన మరో హీరో
CM Revanth Reddy : ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) సీఎం రేవంత్ పేరును మరిచిపోయారని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం అయినా సంగతి తెలిసిందే
- Author : Sudheer
Date : 06-01-2025 - 11:09 IST
Published By : Hashtagu Telugu Desk
మరోసారి సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేరు అంశం వార్తల్లో హైలైట్ అవుతుంది. ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun) సీఎం రేవంత్ పేరును మరిచిపోయారని చెప్పి ఆయన్ను అరెస్ట్ చేసారని పెద్ద ఎత్తున ప్రచారం అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరో సీఎం రేవంత్ పేరును మరచిపోవడం తో ఈయన్ను కూడా అరెస్ట్ చేస్తారా..? అని సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. అసలు ఏంజరిగిందంటే..
Narendra Modi : నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలలో(World Telugu Federation Conference) ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సినీ నటుడు బాలాదిత్య (Baladitya) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సమయంలో, సీఎం రేవంత్‌కు ఆహ్వానం పలకాల్సిన సమయంలో “తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ గారు” అని పలికి వెంటనే తన పొరపాటును గ్రహించి తల పట్టుకున్నారు. తప్పు తెలుసుకున్న బాలాదిత్య తక్షణమే క్షమాపణలు చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి అసలైన పేరును సరిచేసి ప్రస్తావించారు. కానీ అప్పటికే సభలో ఉన్నవారు ఈ సంఘటనను ఆసక్తిగా చూసి చప్పట్లతో, హాస్యంతో స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్స్ మొదలుపెట్టారు. “తెలంగాణ సీఎం పేరు కూడా గుర్తు పెట్టుకోలేకపోయారంటే బాధాకరం” అంటూ కొందరు మండిపడగా, “ఇది ఒక చిన్న పొరపాటు మాత్రమే, అతనిపై ఎక్కువగా ఆరోపణలు చేయడం సరైంది కాదు” అంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. బాలాదిత్య గతంలో జనరల్ నాలెడ్జ్ ప్రోగ్రాంలకు హోస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఇలా జరగటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటువంటి పొరపాట్లు సాధారణమని, ప్రసంగ సమయంలో నర్వస్ కావడం వల్ల జరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ముఖ్య వ్యక్తుల సమక్షంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండటం వల్ల ఇలాంటి పొరపాట్లు సంభవిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.